ఇండియన్‌ అవెంజర్స్‌ వచ్చేశారు

Desi Avengers Comedy Viral Video - Sakshi

హాలీవుడ్‌ సినిమాలు చూసే వారికి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు ‘ అవెంజర్స్‌’ . ఈ సినిమా సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై అభిమానుల అనుకరణ వీడియోలు, స్పూఫులు ఇలా అనేకం వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి కూడా. ప్రస్తుతం ‘దేశీయ అవెంజర్స్‌’ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కామెడీ ప్రధానంగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. తారా దేశ్‌పాండే అనే మహిళ తన ట్విటర్‌ ఖాతాలో శనివారం దీన్ని విడుదల చేశారు. ( 30 ఏళ్ల కృషి; ఆనంద్‌ మహింద్రా ఔదార్యం)

‘‘ఈ వీడియో ఉదయం వాట్సాప్‌లో వచ్చింది. దాదాపు 10 నిమిషాలు నవ్వు ఆపలేకపోయాను. చాలా బాగుంద’’ని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ తీశారన్నది తెలియరాలేదు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మన ఇండియన్‌ అవెంజర్స్‌ వచ్చేశారు.. వీడియో సృజనాత్మకంగా ఉంది.. కెప్టెన్‌ అమెరికా స్కూటర్‌ టైర్‌తో ఉన్నాడు.. దేశీయ అవెంజర్స్‌ ఏకమయ్యారు ’ ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top