లిక్కర్‌ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటలు విచారించిన ఈడీ | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటల పాటు విచారించిన ‘ఈడీ’

Published Sat, Mar 30 2024 3:25 PM

Delhi Minister Appeared Before Ed in Liquor Case - Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో ఆమ్‌ఆద్మీపార్టీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఇటీవలే ఈ కేసులో పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ తాజాగా ఢిల్లీ ప్రభుత్వంలోని మరో మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ను శనివారం(మార్చ్‌ 30) ఐదు గంటల పాటు విచారించింది. లిక్కర్‌ స్కామ్‌ సొమ్మును గోవా ఎన్నికల్లో ఆప్‌ పార్టీ ఖర్చు చేసిన విషయం తనకు తెలియదని గెహ్లాట్‌ ఈడీకి  సమాధానమిచ్చినట్లు తెలిసింది. 

కాగా, రద్దయిన వివాదాస్పద లిక్కర్‌ పాలసీ 2021-22 రూపొందించడంలో కైలాష్‌గెహ్లాట్‌ కూడా కీలకంగా వ్యవహరించారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో గెహ్లాట్‌ సభ్యులుగా ఉన్నారు. లిక్కర్‌ పాలసీని అధికారికంగా వెల్లడించకముందే సౌత్‌ గ్రూప్‌నకు పాలసీ డ్రాఫ్ట్‌  లీకయిందని ఈడీ ఆరోపిస్తోంది.

పాలసీ రూపొందిస్తున్న సమయంలో గెహ్లాట్‌ తన అధికారిక నివాసాన్ని వాడుకోవడానికి ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జ్‌ విజయ్‌నాయర్‌కు అనుమతిచ్చారని, ఇంతేగాక గెహ్లాట్‌ తన మొబైల్‌ నంబర్లను పదే పదే మార్చారని ఈడీ చెబుతోంది. విజయ్‌నాయర్‌ తన అధికారిక నివాసంలో ఉన్నాడన్న విషయాన్ని తాను ఒప్పుకుంటున్నట్లు గెహ్లాట్‌ తాజా విచారణలో ఈడీకి చెప్పినట్లు తెలిసింది. 

ఇదీ చదవండి.. లిక్కర్‌స్కామ్‌లో ఈడీ దూకుడు 

Advertisement
Advertisement