దారుణం: ప్రైవేటు ట్యూటర్‌ను పేపర్ కట్టర్‌తో.. | Sakshi
Sakshi News home page

దారుణం: ప్రైవేటు ట్యూటర్‌ను పేపర్ కట్టర్‌తో..

Published Sun, Sep 3 2023 2:22 PM

Delhi Boy Stabs Tutor To Death With Paper Cutter For Assaul - Sakshi

ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ తన ప్రైవేట్ ట్యూటర్‌ని పేపర్ కట్టర్‌తో కిరాతకంగా హత్య చేశాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడని అందుకే తాను ఈ ఘటనకు పాల్పడ్డానని మైనర్‌ తెలిపాడు. దేశ రాజధానిలోని జామియా నగర్‌లో ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాకిర్ నగర్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్న వసీమ్(28) ఓ ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. పక్కనే జామియా నగర్‌లో ఉన్న ఓ విద్యార్థికి పాఠాలు బోధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగష్టు 30న వసీమ్‌ను మైనర్ విద్యార్థి పేపర్‌ కట్టర్‌తో హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వసీమ్‌ను విద్యార్థి తండ్రి గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. 

కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వసీమ్‌ను మైనర్ విద్యార్థే కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. నేరం అంగీకరించిన విద్యార్థి.. తనను లైంగికంగా పలుమార్లు వేధించాడని, ఆ వీడియోలు తీసి, వాటిని బయటపెడతానని బెదిరించినట్లు ఆరోపించాడు. ఈ ఘటనలో మైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స..

Advertisement
 
Advertisement
 
Advertisement