భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు లైన్‌ క్లియర్‌

DCGI Given Approval For Covaxin And  Covishield Vaccines For Corona - Sakshi

ఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌కు డీసీజీఐ ఆదివారం శుభవార్త చెప్పింది.  కోవాగ్జిన్,  కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. (చదవండి: 3 కోట్ల మందికి ఉచిత టీకా)

ఈ సందర్భంగా డీసీజీఐ డైరెక్టర్‌ విజి సోమాని మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిసీజీఐ అనుమతితో మరో వారం రోజుల్లోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీజీసీఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top