కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!

Covid Virus Expected to Continue To Transmit For Very Long Time - Sakshi

హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరిగితే కట్టడి 

డబ్ల్యూహెచ్‌ఓ అధికారిణి పూనమ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్‌ అధికారి పూనమ్‌ కేత్రపాల్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఒక సమూహంలో టీకాలు, గత ఇన్‌ఫెక్షన్ల ఆధారంగా వృద్ధి చెందే ఇమ్యూనిటీ స్థాయిలను(హెర్డ్‌ ఇమ్యూనిటీ లేదా సమూహ రోగనిరోధకత) బట్టి దీర్ఘకాలంలో కరోనా ఎండమిక్‌(ఒకప్రాంతానికి పరిమితం అయ్యేవ్యాధి)గా మారే అవకాశాలుంటాయన్నారు.

వైరస్‌ అదుపులో మనిషి ఉండకుండా, మనిషి అదుపులో వైరస్‌ ఉండే పరిస్థితిన సాధించాలని సంస్థ దక్షిణాసియా డైరెక్టర్‌గా పనిచేస్తున్న సింగ్‌ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించిన ప్రాంతాల ప్రజలపై కరోనా ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేశారు. కోవాక్సిన్‌కు ఈయూఏ(అత్యవసర అనుమతులు) ఇవ్వడంపై మాట్లాడుతూ ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ సమర్పించిన గణాంకాల మదింపు జరుగుతోందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని తెలిపారు. 
చదవండి: (పోస్ట్‌ కోవిడ్‌ సిండ్రోమ్‌: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?)

దేశాలన్నింటిలో కరోనా మరణాలకు అధికశాతం కారణం టీకా తీసుకోకపోవడమేనని, ఈ సమయంలో బూస్టర్‌డోసులిస్తే అసలు టీకా తీసుకోనివారికి సరఫరా కష్టమవుతుందని వివరించారు. అందుకే బూస్టర్‌ డోసులపై సంస్థ ఈ ఏడాది చివరివరకు నిషేధం విధించిందని చెప్పారు. అన్ని దేశాల్లో కనీసం 40 శాతం ప్రజానీకానికి టీకా అందేలా చూడాల్సిఉందన్నారు. అందరూ సురక్షితమయ్యేవరకు ఏ ఒక్కరూ సురక్షితం కాదని గుర్తు చేశారు. సమయాన్ని బట్టి కరోనా టీకా ప్రభావం తగ్గుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి స్థిరమైన ఆధారాల్లేవని చెప్పారు. బూస్టర్‌ డోసులకు తాము వ్యతిరేకం కాదని, శాస్త్రీయ నిరూపణలను బట్టి బూస్టర్‌పై సిఫార్సులుంటాయని ఆమె చెప్పారు.  

పూర్తి నిర్మూలన అసాధ్యం 
కరోనాను ప్రపంచం నుంచి పూర్తిగా తరిమివేయడం సాధ్యం కాకపోవచ్చని పూనమ్‌ అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమేణా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని, తద్వారా మరణాలను, ఆస్పత్రిపాలవడాన్ని, ఇతర నష్టాలను కనిష్టాలకు తీసుకురావచ్చని చెప్పారు. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ నుంచి రక్షణ బలహీనంగానే ఉందని, చాలామంది ప్రజలకు వైరస్‌ సోకే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందుకే టీకా తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, గాలాడని ప్రాంతాల్లో గుమికూడడాన్ని తగ్గించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం తదితర చర్యలు కొనసాగించాలని గట్టిగా సూచించారు.

థర్డ్‌ వేవ్‌ రాకడ, దాని బలం.. మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా సరైన చర్యలు పాటిస్తే మరో వేవ్‌ రాకుండా చూసుకోవచ్చన్నారు. అనేక దేశాల్లో టీకా లభించని ఈ తరుణంలో తిరిగి కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతి చేయాలన్న భారత్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. కరోనా కారణంగా దేశాలు తమ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిచే అవకాశం లభించిందని ఆమె చెప్పారు. ఆరోగ్య వ్యవస్థపై ఇలాగే పెట్టుబడులు పెరగాలని అభిలషించారు. బలమైన ఆరోగ్య వ్యవస్థలుంటే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోగలమని ప్రపంచ దేశాలు గుర్తించాలని సింగ్‌ చెప్పారు. 
(చదవండి: Pakistan: ఫ్యూన్‌ పోస్ట్‌ కోసం ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-09-2021
Sep 27, 2021, 16:15 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి...
27-09-2021
Sep 27, 2021, 07:49 IST
ధార్‌: దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. నిత్యం లక్షలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. అయితే, ప్రధానమంత్రి...
25-09-2021
Sep 25, 2021, 16:32 IST
దేశంలో ఇకపై రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు, వేల మరణాలు ఉండకపోవచ్చని ప్రముఖ వైరాలజిస్ట్, వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ...
22-09-2021
Sep 22, 2021, 09:02 IST
హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ 18 ఏళ్లలోపు వారికి ఇచ్చే కోవాగ్జిన్‌ టీకా ఫేజ్‌ 2/3 ట్రయల్స్‌ పూర్తి...
21-09-2021
Sep 21, 2021, 11:07 IST
డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్‌ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ...
21-09-2021
Sep 21, 2021, 02:45 IST
వేషము మార్చెను, భాషను మార్చెను, చివరకు తానే మారెను... అని మనిషి పోకడను ఒక సినీ కవి వర్ణించాడు. ప్రస్తుతం...
20-09-2021
Sep 20, 2021, 10:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర...
17-09-2021
Sep 17, 2021, 07:48 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో గర్భిణులకు అధికంగా ముప్పు ఉండే అవకాశాలున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తాజా...
17-09-2021
Sep 17, 2021, 06:18 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్‌ వేవ్‌ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ...
14-09-2021
Sep 14, 2021, 03:20 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారితో తలపడుతూ రాష్ట్రంలో టీకాల యజ్ఞం ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ తాజాగా మరో మైలురాయిని...
13-09-2021
Sep 13, 2021, 07:34 IST
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): గ్రేటర్‌లో కోవిడ్‌ టీకాలు కోటికి చేరువయ్యాయి. అంచనాకు మించి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేవలం స్థానికులే కాకుండా...
10-09-2021
Sep 10, 2021, 03:32 IST
కరోనా వైరస్‌ వ్యాప్తి 2020 మార్చి నుంచి ఉన్నా వేరియంట్‌లపై మనం ఎక్కువ దృష్టి సారించింది సెకండ్‌ వేవ్‌లోనే. దేశంలో...
08-09-2021
Sep 08, 2021, 03:03 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబ...
07-09-2021
Sep 07, 2021, 21:28 IST
హనోయి: కోవిడ్‌ నిబంధనలను ఉ‍ల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్‌ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల...
07-09-2021
Sep 07, 2021, 18:26 IST
న్యూఢిల్లీ: ​కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకుగాను ప్రారంభించిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా వేగంగా సాగుతుందని.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 కోట్ల...
06-09-2021
Sep 06, 2021, 05:00 IST
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా,...
06-09-2021
Sep 06, 2021, 03:10 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పట్టణాల్లో వేలల్లో ఉన్న కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఇప్పుడు...
05-09-2021
Sep 05, 2021, 03:24 IST
సాక్షి, అమరావతి: ‘దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రజారోగ్య వ్యవస్థ కేరళలో మాత్రమే ఉంది. అయినా సరే.. కోవిడ్‌ కట్టడి, నిర్వహణ...
05-09-2021
Sep 05, 2021, 01:57 IST
జూలూరుపాడు/బూర్గంపాడు/పినపాక /దమ్మపేట/టేకులపల్లి/యాదాద్రి: పాఠశాలలు తెరిచిన మూడో రోజునే భద్రాద్రి కొత్త గూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కరోనా కలకలం సృష్టించింది....
04-09-2021
Sep 04, 2021, 20:45 IST
హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌ సోమేశ్ కుమార్ విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల టీకా వివరాలకు సంబంధించి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో... 

Read also in:
Back to Top