Bangalore Covid Cases Increasing: కోవిడ్‌ భీతావహం.. బెంగళూరు వాసుల్లో కలవరం - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ భీతావహం.. బెంగళూరు వాసుల్లో కలవరం

Apr 10 2021 8:29 AM | Updated on Apr 10 2021 9:40 AM

Covid 19 Second Wave Karnataka Records 7955 New Cases - Sakshi

కోవిడ్‌ విస్తరణ బెంగళూరులో వాయువేగంతో సాగుతోంది. రాజధానిలో కొత్తగా 5,576 కేసులు నమోదు అయ్యాయి.

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో రెండో దాడిలో కరోనా మహమ్మారి శుక్రవారం రికార్డు స్థాయిలో ఎగబాకింది. భీతావహంగా 7,955 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 3,220 మంది కోవిడ్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. పాజిటివ్‌లతో పోలిస్తే డిశ్చార్జ్‌లు భారీగా క్షీణించడం కరోనా ఉధృతికి అద్దంపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10.40 లక్షల మంది కోవిడ్‌ బారిన పడగా 9.77 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు.  ఇంకా 58,084 మంది చికిత్స పొందుతున్నారు.  

బెంగళూరుకు కలవరం  
కోవిడ్‌ విస్తరణ బెంగళూరులో వాయువేగంతో సాగుతోంది. రాజధానిలో కొత్తగా 5,576 కేసులు నమోదు అయ్యాయి. వీటితో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 4,70,014కు పెరిగింది. మొత్తం కోలుకున్నవారు 4,22,719కి చేరారు. ఇంకా 42,525 మంది కోవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.  

మరణాల పెరుగుదల.. 
సెకెండ్‌ వేవ్‌లో మరణాలు ఆకస్మికంగా పెరిగాయి. శుక్రవారం 46 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 29 మంది బెంగళూరు వాసులే కావడం గమనార్హం.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12,813 మంది కోవిడ్‌కు బలి అయ్యారు.   

చదవండి: వైరస్‌ విస్ఫోటనం.. అక్కడే కేసులు ఎందుకు అధికం?!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement