యూట్యూబ్‌ చూసి.. ఏకంగా రూ. 40 లక్షలు చోరీ

Couple Committed Thefts After Watching YouTube - Sakshi

సాక్షి, హుబ్లీ: యూట్యూబ్‌ చూసి అందులో చోరీ చేయడం ఎలాగో తెలుసుకుని రూ.40 లక్షల చోరీకి పాల్పడిన ఘరానా జంటను ధార్వాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను వైష్ణవి, యువరాజులుగా గుర్తించారు. ధార్వాడలో కోర్టు సర్కిల్‌ వద్ద వీరేశ్వర కో–ఆపరేటివ్‌ సొసైటీలో కొత్త సంవత్సరం వేడుకల రోజున తొలి ప్రయత్నంగా చోరీకి పాల్పడి భారీగా నగదును దోచుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధార్వాడ టౌన్‌ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర మంత్రి శశికళా జొల్లెకి చెందిన ఎక్సంబాదా సొసైటీకి చెందిన ధార్వాడ శాఖలో నిందితులు బంగారు ఆభరణాలతో పాటు నగదు మొత్తం కలిపి రూ.40 లక్షలు చోరీ చేశారు. నెల రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.   

(చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top