breaking news
stolen cash
-
4 నిమిషాలు.. రూ.29.69 లక్షలు!
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖాలకు మాస్క్‌లు.. చేతులకు గ్లౌస్లు.. వెంట ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లు.. దర్జాగా స్విఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంలోకి చొరబాటు.. కట్ చేస్తే సినీ ఫక్కీలో నాలుగంటే నాలుగే నిమిషాల్లో రూ.29,69,900 కొట్టేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ చోరీ ఘటన జరిగింది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తెల్లని కారులో ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు.ముందుగా ఒక వ్యక్తి కారులోంచి దిగి ఏటీఎంలోకి ప్రవేశించాడు. అలారం మోగకుండా వైర్లు కత్తిరించాడు. తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. మరో ఇద్దరు వెంటనే కారు దిగి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లతో రాత్రి 1:55 గంటలకు ఏటీఎం లోపలికి ప్రవేశించారు. ఒక వ్యక్తి సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టాడు. దీంతో సీసీ కెమెరాలు బ్లర్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది. వెంటనే గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి, అందులో ఉన్న రూ.29.69 లక్షల నగదు అపహరించుకుపోయారు. ముందే రెక్కీ? ఈ చోరీకి ఒకటి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం నాలుగు నిమిషాల్లో పని పూర్తి చేయడంతో దొంగలను ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నారు. కాగా, దుండగుల కారు పహాడీషరీఫ్ వైపు నుంచి వచ్చి మళ్లీ అటే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ చోరీ జరిగిన పది నిమిషాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదిభట్ల పోలీసులకు సమాచారం వచి్చంది. వెంటనే అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పరారయ్యారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్, సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, క్రైం డీసీపీ అరవింద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు . ఐదు బృందాలతో గాలింపు రావిర్యాలలో జరిగిన ఈ చోరీ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆదిభట్ల పోలీసులు, క్రైమ్ సిబ్బంది, ఎస్ఓటీ, సైబర్ క్రైమ్ సిబ్బందిని కలిపి మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు వెళ్లిన స్థలాలను, వారి కారు నంబర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. -
యూట్యూబ్ చూసి.. ఏకంగా రూ. 40 లక్షలు చోరీ
సాక్షి, హుబ్లీ: యూట్యూబ్ చూసి అందులో చోరీ చేయడం ఎలాగో తెలుసుకుని రూ.40 లక్షల చోరీకి పాల్పడిన ఘరానా జంటను ధార్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వైష్ణవి, యువరాజులుగా గుర్తించారు. ధార్వాడలో కోర్టు సర్కిల్ వద్ద వీరేశ్వర కో–ఆపరేటివ్ సొసైటీలో కొత్త సంవత్సరం వేడుకల రోజున తొలి ప్రయత్నంగా చోరీకి పాల్పడి భారీగా నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధార్వాడ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రి శశికళా జొల్లెకి చెందిన ఎక్సంబాదా సొసైటీకి చెందిన ధార్వాడ శాఖలో నిందితులు బంగారు ఆభరణాలతో పాటు నగదు మొత్తం కలిపి రూ.40 లక్షలు చోరీ చేశారు. నెల రోజుల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. (చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు..) -
కంట్లో కారం చల్లి రూ. 35 లక్షల చోరీ
-
4 సంవత్సరాల బాలుడు..ఓ ఇంటి దొంగ
బీజింగ్: నాలుగు సంవత్సరాల వయసు. ఇంట్లో వాళ్లు చెప్పింది విని బుద్ధిగా తరగత పాఠాలు నేర్చుకోవాల్సిన ప్రాయం అది. ఆ వయసులోనే చెడు మార్గం పట్టి..ఇంటి దొంగగా మారితే కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణించలేనిదే. ఈ తరహా ఘటనే చైనా రాజధాని బీజింగ్ కు సమీపంలోని షియాంగ్ లో చోటు చేసుకుంది. ఇంట్లో వాళ్లను బరిడీ కొట్టించిన ఒక బాలుడు 3,264 డాలర్లను కాజేశాడు. స్నేహితులతో కలిసి జూదం ఆడేందుకు ప్రణాళిక రచించుకున్న ఆ బాలుడు ఆ డబ్బును తన స్కూల్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. గతవారం ఇచ్చిన హోం వర్క్ ను పరిశీలించేందుకు టీచర్ ఆ బ్యాగ్ ను తీయగా ఆ బాలుని వద్ద పెద్ద మొత్తంలో డబ్బు కనబడింది. దీంతో నివ్వెరపోయిన ఆ టీచర్ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా అసలు విషయ తెలిసింది. తన ప్నేహితులతో కలిసి గాంబ్లింగ్ ఆట ఆడేందుకు డబ్బును ఇంట్లోనుంచి అపహరించినట్లు బాలుడు తెలిపాడు. దీంతో వారు ఆ బాలుని తల్లి దండ్రులకు విషయాన్ని తెలియజేశారు. వ్యాపర పనుల్లో భాగంగా దాచి పెట్టిన ఆ సొమ్మును కొడుకు దొంగిలించడంతో తల్లి దిగ్భ్రాంతికి గురైంది.