Corona Cases: దేశంలో కరోనా టెన్షన్‌.. పెరుగుతున్న కేసులు

Corona Postive Cases And Daily Positivity Rate Increase In India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్‌ కారణంగా 30 మంది మృతిచెందారు. 862 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 

ప్రస్తుతం దేశంలో 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,60,086కు చేరింది. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందారు. 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇక, రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. 

ఇదిలా ఉండగా.. దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్‌ అయ్యింది. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు.   

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కన్నుమూత.. సీఎం, గవర్నర్‌ సంతాపం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top