కాంగ్రెస్‌ నేతల రక్తంలోనే అనినీతి ఉంది: సీఎం సంచలన కామెంట్స్‌

Congress Leaders Protest At CM Bhagwant Maan Residence - Sakshi

పంజాబ్‌లో పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక వినూత్న సీఎం భగవంత్‌ మాన్‌ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో కాంగ్రెస్‌ నేతల సీఎం భగవంత్‌ మాన్‌ నివాసం ఎదుట నిరసనలకు దిగారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలను గురువారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని సెక్టార్‌-3లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కాం‍గ్రెస్‌ నేతలు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా సీఎం మాన్‌ స‍్పందించారు. కాంగ్రెస్‌ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కేసులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేతలకు మద్దతుగా ఆ పార్టీ నేతలు తన నివాసం వద్ద నిరసన చేపట్టారని మండిపడ్డారు. పంజాబ్‌ను అక్రమంగా దోచుకుతిన్న వారిని కాపాడటానికి కాంగ్రెస్‌ ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతలు తమ రక్తంలోనే అవినీతి ఉందని నిరూపించుకున్నారని షాకింగ్‌ వ్యాఖ‍్యలు చేశారు. అవినీతి కాంగ్రెస్‌ నేతలకు హక్కుగా మారిందని సీఎం ఫైర్‌ అయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు.. మాజీ మంత్రి సాధు సింగ్ ధ‌రమ్‌సోత్ అరెస్ట్ వ్యవ‌హారంపై మాట్లాడేందుకు త‌మ‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం భగవంత్‌ మాన్‌.. తర్వాత త‌మ‌తో భేటీకి నిరాక‌రించార‌ని ఆరోపించారు. కాగా, ద‌ళిత స్కాల‌ర్‌షిప్ స్కీముల్లో కోట్లాది రూపాయ‌ల స్కామ్‌కు ప్రధాన సూత్రధారిగా సాధుసింగ్‌ను విజిలెన్స్ బ్యూరో అరెస్ట్‌ చేసింది. 

ఇది కూడా చదవండి: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కేసు నమోదు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top