బొగ్గు గనిలో పేలుడు..ఏడుగురి మృతి | Coal mine Blast In Bengal Birbhum District | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో పేలుడు..ఏడుగురి మృతి

Oct 7 2024 1:40 PM | Updated on Oct 7 2024 2:59 PM

Coal mine Blast In Bengal Birbhum District

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బీర్భుమ్‌ జిల్లాలోని ఓ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. సోమవారం(అక్టోబర్‌7) జరిగిన ఈ పేలుడులో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. 

గంగారామ్‌చక్‌ మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన గనిలో బొగ్గు వెలికితీసేందుకుగాను బాంబులు పెడుతుండగా పేలుడు సంభవించింది.పేలుడు తర్వాత గని ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. గని వద్ద నిలిపి ఉంచిన వాహనాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి.  

ఇదీ చదవండి: పండుగల వేళ ఢిల్లీలో హై అలర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement