ఢిల్లీకి వ్యాక్సిన్‌ సరఫరాకు స్పుత్నిక్‌-వి అంగీకారం: కేజ్రీవాల్‌

 CM Arvind Kejriwal Says Sputnik V Agreed To Supply Vaccine Delhi - Sakshi

ఢిల్లీ: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు  ఢిల్లీ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను ఢిల్లీకి సరఫరా చేసేందుకు తయారీదారులు అంగీకరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం తెలిపారు. అయితే ఎంత మొత్తంలో రాష్ట్రానికి వ్యాక్సిన్‌ సరఫరా చేస్తారనేదానిపై క్లారిటీ లేదని ఆయన తెలిపారు.

కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. '' స్పుత్నిక్‌-వి తయారీదారులతో ఇప్పటికే చర్చలు జరిపాం. వారు వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు అంగీకరించారు. అయితే ఎంత మొత్తం ఇస్తారనేదానిపై స్పష్టత రాలేదు. మంగళవారం కూడా మరోసారి తయారీదారులతో మా అధికారులు చర్చలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి వ్యాక్సిన్‌ కొనుగోలు చుసి తమ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చిన కేంద్రం తెలిపింది.  వ్యాక్సిన్‌ సరఫరాపై అనేక రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించినా ఒక్క తయారీ సంస్థ కూడా ముందుకు రావడం లేదు. కానీ ఈ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ఒక్క రాష్ట్రానికి కూడా వ్యాక్సిన్‌ డోస్‌ను అందించలేదు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ అవసరాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇక లాక్‌డౌన్‌ను నిరవధికంగా కొనసాగించే ఆలోచన లేదు. అలా చేయడం వల్ల ఆర్ధిక, వ్యాపార కార్యకలపాలు దెబ్బతింటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెలాఖరున లాక్‌డౌన్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాం.'' అని తెలిపారు

ఇక దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు రెండువేల కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1491 మంది కరోనా బారీన పడగా.. 130 మంది కరోనాతో మృతి చెందారు. కాగా కరోనా పాజిటివిటీ రేటు రెండు నెలల కనిష్టానికి పడిపోయి 1.93 శాతంగా నమోదైంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న 200లకు పైగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25న 100 కంటే తక్కువ కేసులు నమోదవగా.. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన వారి సంఖ్య  600కు చేరినట్లు సమాచారం.
చదవండి: ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కలకలం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-05-2021
May 26, 2021, 14:51 IST
జైపూర్‌: కోవిడ్‌ దేశంలోని ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడి వందల కొద్దీ ప్రాణాలు...
26-05-2021
May 26, 2021, 14:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేకమంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మహమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే...
26-05-2021
May 26, 2021, 12:50 IST
హాంగ్‌కాంగ్‌: వేలం పాటలో వజ్రాలకు అత్యధిక ధర పలకడం తెలిసిందే. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్  ‘ది సాకురా’ను హాంగ్‌కాంగ్‌లో వేలం...
26-05-2021
May 26, 2021, 10:43 IST
సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో మళ్లీ 2లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర...
26-05-2021
May 26, 2021, 09:53 IST
కరోనాతో అల్లాడిపోతున్న జనాల్లో కొత్త ఆశలను రేకెత్తించింది ఆనందయ్య మందు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసినా కట్టడి కాని వైరస్‌...
26-05-2021
May 26, 2021, 09:34 IST
వ్యాక్సిన్​ వేయించుకున్నారా? అయితే చావు ఖాయం. అది కూడా రెండేళ్లలోపే!. ఇది ఇప్పుడు వాట్సాప్​లో చక్కర్లు కొడుతున్న ఒక ఫార్వార్డ్ మెసేజ్...
26-05-2021
May 26, 2021, 09:24 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మరణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు 577 మంది ఉన్నట్లు రాష్ట్రాలు వెల్లడించాయని కేంద్ర...
26-05-2021
May 26, 2021, 09:00 IST
ఈ దర్శకుడికి కరోనా సోకడంతో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచాడు.
26-05-2021
May 26, 2021, 08:54 IST
కోల్‌కతా: గత వారంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టచార్జీ(77) మంగళవారం ఆస్పత్రిలో చేరారు....
26-05-2021
May 26, 2021, 08:30 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీని సందర్శించారు....
26-05-2021
May 26, 2021, 08:27 IST
బనశంకరి: కరోనా మహమ్మారి గర్భంలోని బిడ్డను– తల్లిని వేరు చేసింది. వైద్యుల చొరవతో కడుపులోని బిడ్డ ప్రాణాలతో బయటపడింది కానీ,...
26-05-2021
May 26, 2021, 04:12 IST
ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతం మందికిపైగా కరోనా పలకరించి వెళ్లిపోయింది!
26-05-2021
May 26, 2021, 04:03 IST
ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఆటోడ్రైవర్లతో వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.
26-05-2021
May 26, 2021, 03:27 IST
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి అందరినీ బెంబేలెత్తిస్తోంది. దీంతో అందరూ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు రకరకాల మందులూ, ఆహారం...
26-05-2021
May 26, 2021, 02:13 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ తర్వాతి వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని కోవిడ్‌–19 వర్కింగ్‌ గ్రూప్‌...
25-05-2021
May 25, 2021, 19:29 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదిరోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మంగళ వారం (నేటి) నుంచే పునఃప్రారంభమవుతోంది. ఈ మేరకు...
25-05-2021
May 25, 2021, 17:44 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,06,210...
25-05-2021
May 25, 2021, 12:26 IST
ఒకవేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడితే, పూర్తి స్థాయి జీతంతో పాటు సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్‌...
25-05-2021
May 25, 2021, 10:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. అయితే కరోనా మరణాలు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా...
25-05-2021
May 25, 2021, 10:19 IST
ఆర్డినరీ హీరోలు ఎక్స్‌ట్రార్డినరీగా పనిచేస్తున్న వారి కథనాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. వాళ్లు చేస్తున్న కార్యక్రమాలు నాలో కొత్త ఆశను...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top