ఈసారి చార్‌ధామ్‌ యాత్రకు సరికొత్త రికార్డులు? | Sakshi
Sakshi News home page

Chardham Yatra-2024: ఈసారి చార్‌ధామ్‌ యాత్రకు సరికొత్త రికార్డులు?

Published Mon, Apr 29 2024 11:20 AM

Chardham Yatra-2024 Bumper Booking in GMVN Guest House

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర  2024, మే 10 నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహరాజ్‌ మాట్లాడుతూ చార్‌ధామ్‌ యాత్రకు అనూహ్య స్పందన వస్తున్నదని యాత్రా మార్గంలోని జీఎంవీఎన్‌ అతిథి గృహాల బుకింగ్స్‌ రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు.

గత ఏడాది 56 లక్షల 31 వేల మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారని, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కానున్నదని సత్పాల్‌ మహరాజ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర మార్గాల్లోని 94 జీఎంవీఎన్‌ అతిథి గృహాల్లో వసతి కోసం ఆన్‌లైన్ మాధ్యమంలో 8 కోట్ల 58 లక్షల 39 వేల 892 మంది, ఆఫ్‌లైన్‌లో 3 కోట్ల 70 లక్షల 22 వేల 819 మంది బుకింగ్స్‌ చేశారన్నారు. ఈ సంఖ్య  అంతకంతకూ పెరుగుతున్నదన్నారు.

ఇప్పటివరకు యాత్రకు సంబంధించిన జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ, గంగోత్రి ధామ్‌ సందర్శనకు 2,87,358 మంది, యమునోత్రి ధామ్‌కు 2,60,597 మంది, కేదార్‌నాథ్ ధామ్‌కు 5,40,999 మంది, బద్రీనాథ్ ధామ్‌కు 4,53,213 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.

అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు డెహ్రాడూన్‌లోని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికుల కోసం టోకెన్లు, స్టాళ్ల వ్యవస్థను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈసారి చార్‌ధామ్ యాత్రలో రవాణా శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement