breaking news
Bumper bonanza
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బొనాంజా!!
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ షేర్హోల్డర్లకు బంపర్ బొనాంజా ప్రకటించింది. తొలిసారిగా బోనస్ షేర్లు జారీ చేయనుంది. 1:1 నిష్పత్తిలో షేరు ఒక్కింటికి ఒక షేరు చొప్పున కేటాయించనుంది. ఇందుకోసం ఆగస్టు 27ని రికార్డు తేదీగా నిర్ణయించారు. ఇష్యూని బోర్డు ఆమోదించిన రెండు నెలల్లోగా, అంటే సెపె్టంబర్ 18లోగా బోనస్ షేర్లు క్రెడిట్ అవుతాయని బ్యాంకు వెల్లడించింది. సుమారు రూ. 766.79 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకు జారీ చేయనుంది. జూన్ క్వార్టర్ ఆఖరు నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ. 2 లక్షల వరకు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ గల చిన్న రిటైల్ షేర్హోల్డర్లు 36 లక్షల పైగా ఉన్నారు. వీరి వాటా సుమారు 10.32 శాతం వరకు ఉంటుంది. గతంలో 2011లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10 ముఖ విలువ చేసే షేర్లను రూ. 2 ముఖ విలువ చేసే అయిదు షేర్లుగా విభజించింది. ఆ తర్వాత 2019లో వాటిని రూ. 1 ముఖ విలువ చేసే రెండు షేర్లుగా విడగొట్టింది. కంపెనీ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 10 శాతం పెరిగి బీఎస్ఈలో ప్రస్తుతం రూ. 1,957 వద్ద ఉంది. బీఎస్ఈ రికార్డుల ప్రకారం బ్యాంక్ ఇప్పటివరకు ఎన్నడూ బోనస్ షేర్లు ప్రకటించలేదు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 5 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. దీనికి జూలై 25 రికార్డు తేదీగా ఉంటుంది. ఆగస్టు 11న బ్యాంక్ డివిడెండ్ చెల్లిస్తుంది. 2024 మేలో రూ. 19.5 చొప్పున తుది డివిడెండ్ ఇచ్చిన బ్యాంకు, గత నెలలో రూ. 22 చొప్పున మరోసారి డివిడెండ్ చెల్లించింది. అంతకు ముందు 2022 మేలో రూ. 15.5 చొప్పున, 2023 మేలో రూ. 19 చొప్పున డివిడెండ్ ఇచి్చంది. కన్సాలిడేటెడ్ లాభం స్వల్పంగా డౌన్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 16,258 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ1లో నమోదైన రూ. 16,475 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.31 శాతం తక్కువ. మరోవైపు, స్టాండెలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ. 16,174 కోట్ల నుంచి సుమారు 12 శాతం వృద్ధితో రూ. 18,155.21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 83,701 కోట్ల నుంచి రూ. 99,200 కోట్లకు ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మాత్రం ఆదాయం రూ. 1.17 లక్షల కోట్ల నుంచి రూ. 1.33 లక్షల కోట్లకు చేరింది.జూన్ క్వార్టర్ వివరాలు.. → సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు రూ. 59,817 కోట్ల నుంచి రూ. 63,467 కోట్లకు పెరిగాయి. → స్టాండెలోన్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 5.4 శాతం పెరిగి రూ. 31,438 కోట్లకు చేరింది. → నికర వడ్డీ మార్జిన్ 3.46 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. → నిర్వహణ వ్యయాలు రూ. 16,621 కోట్ల నుంచి రూ. 17,434 కోట్లకు పెరిగాయి. ఇందులో రూ. 6,158 కోట్ల మేర ఉద్యోగులపై వ్యయాలు, రూ. 11,276 కోట్లు ఇతరత్ర వ్యయాలు ఉన్నాయి. → మొత్తం ప్రొవిజన్లు రూ. 2,602 కోట్ల నుంచి రూ. 14,442 కోట్లకు ఎగిశాయి. ఇందులో ‘ఫ్లోటింగ్ ప్రొవిజన్’ రూ. 9,000 కోట్లు ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. → అసెట్స్ నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మార్చి త్రైమాసికంతో పోలిస్తే 1.33 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగింది. → స్థూల రుణాలు రూ. 26,53 లక్షల కోట్లకు (6.7 శాతం వృద్ధి, డిపాజిట్లు 16.2 శాతం పెరిగి రూ. 27.64 లక్షల కోట్లకు చేరాయి. → కాసా నిష్పత్తి 38.2 శాతం నుంచి 33.9 శాతానికి తగ్గింది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ. 6.39 లక్షల కోట్లుగా ఉండగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్నాయి. → కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే హెచ్డీబీ ఐపీవో ద్వారా వచి్చన నిధుల కారణంగా ఇతర ఆదాయం రూ. 21,730 కోట్లకు పెరిగింది. → స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.40 శాతంగా, నికర ఎన్పీఏల నిష్పత్తి స్వల్పంగా పెరిగి 0.47 శాతంగా నమోదైంది. → అనుబంధ కంపెనీ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఐపీవోకి రావడంతో అందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 94.32 శాతం నుంచి 74.19 శాతానికి తగ్గింది. -
ఈసారి చార్ధామ్ యాత్రకు సరికొత్త రికార్డులు?
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర 2024, మే 10 నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ చార్ధామ్ యాత్రకు అనూహ్య స్పందన వస్తున్నదని యాత్రా మార్గంలోని జీఎంవీఎన్ అతిథి గృహాల బుకింగ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు.గత ఏడాది 56 లక్షల 31 వేల మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారని, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కానున్నదని సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర మార్గాల్లోని 94 జీఎంవీఎన్ అతిథి గృహాల్లో వసతి కోసం ఆన్లైన్ మాధ్యమంలో 8 కోట్ల 58 లక్షల 39 వేల 892 మంది, ఆఫ్‌లైన్‌లో 3 కోట్ల 70 లక్షల 22 వేల 819 మంది బుకింగ్స్ చేశారన్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదన్నారు.ఇప్పటివరకు యాత్రకు సంబంధించిన జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ, గంగోత్రి ధామ్ సందర్శనకు 2,87,358 మంది, యమునోత్రి ధామ్‌కు 2,60,597 మంది, కేదార్నాథ్ ధామ్‌కు 5,40,999 మంది, బద్రీనాథ్ ధామ్‌కు 4,53,213 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు డెహ్రాడూన్‌లోని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికుల కోసం టోకెన్లు, స్టాళ్ల వ్యవస్థను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈసారి చార్ధామ్ యాత్రలో రవాణా శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. -
రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బంపర్ బొనాంజా ప్రకటించారు. వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది విఏఓలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తం 35,749 మందికి ఒక నెల మూల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాసు పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్ లో శనివారం సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.’ అని అభినందించారు. ‘దాదాపు 80 ఏళ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదు. క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. భూరికార్డులు గందరగోళంగా మారిన పరిస్థితుల్లో పెట్టుబడి సాయం పథకం అమలు చేసేందుకు ఏ భూమికి ఎవరు యజమానో ఖచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూ రికార్డులను సరిచేసి, పూర్తి పారదర్శకంగా పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్న రైతులతో పాటు, అసైన్డ్ దారులన కూడా ఓ కొలిక్కి తెచ్చారు. రాష్ట్రంలో పంచిన 22.5 లక్షల ఎకరాల భూమికి గాను 20లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహాయిస్తే మిగతా భూములు కూడా క్లియర్ అయ్యాయి. ఇది సాధారణ విషయం కాదు. దేశంలో ఎవరూ సాధించని ఘనత రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఒక నెల మూల వేతనాన్ని అదనంగా అందిస్తాం’ అని సీఎం ప్రకటించారు. -
బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో పోటీని తట్టుకొనే క్రమంలో తమ కొత్త కస్టమర్లకోసం మరో నూతన పథకాన్ని గురువారం ప్రకటించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త వినియోగదారులను ఆకట్టుకునే యోచనలో 'ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడ్ బీబీ249' గా చెబుతున్న ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా కేవలం రూ 249 చెల్లించి అపరిమిత బ్రాడ్ బ్యాండ్ డేటాను డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటి ఆరునెలలు నెలల వరకూ రూ.249 ల చార్జ్ తో అపరిమిత డాటా డౌన్ లోడ్ అనుభవాన్ని అందించనుంది. సెప్టెంబర్ 9వతేదీనుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు వివరించింది. ఎ) అయితే ఇది ఆఫర్ కొత్త బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే బి) ఇదే టారిఫ్ తో ఎఫ్టీటీహెచ్ అందుబాటులో ఉంటుంది. సి) ప్రమోషన్ పీరియడ్ లో ఎలాంటి ఇన్ స్టలేషన్ చార్జీలు ఉండవు. డి) మిగతా అన్ని చార్జీలు ప్రస్తుతం అమలుచేస్తున్న టారిఫ్ ప్రకారమే ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది చార్ట్ ను పరిశీలించండి. -
బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా
న్యూఢిల్లీ: దేశీయ టెలికం పరిశ్రమలోకి జియో ఎంట్రీ తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన టెల్కోలన్నీ దిగివచ్చి చార్జీల్లో భారీ తగ్గింపులు, బంపర్ ఆఫర్ లు ప్రకటించగా తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ బొనాంజా ప్రకటించింది. నెలకు రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులకు బంపర్ బొనాంజా ఆఫర్ చేసింది. దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్, ఉచిత డాటాను అఫర్ చేస్తోంది. 'బీబీజీ కాంబో ప్లాన్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో వినియోగదారులు నెలకు రూ.1199 దేశంలో లోకల్ , ఎస్టీడీ కాల్స్ 24గంటలు ఉచితం, దీంతోపాటు అన్ లిమిటెడ్ డాటా ఆఫర్ అందిస్తోంది. మరిన్ని వివరాలకోసం ఈ పట్టికను గమనించండి.