బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా | Bumper bonanza for BSNL customers! Get unlimited call and data–Check out the full tariff chart | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

Sep 16 2016 11:24 AM | Updated on Sep 4 2017 1:45 PM

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా

దేశీయ టెలికం పరిశ్రమలోకి జియో ఎంట్రీ తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నెలకు రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులకు బంపర్ బొనాంజా ఆఫర్ చేసింది.

న్యూఢిల్లీ: దేశీయ టెలికం పరిశ్రమలోకి జియో ఎంట్రీ తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే   ప్రధాన టెల్కోలన్నీ  దిగివచ్చి   చార్జీల్లో భారీ తగ్గింపులు, బంపర్ ఆఫర్ లు ప్రకటించగా తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం  సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు  మరో బంపర్ బొనాంజా ప్రకటించింది.

నెలకు  రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్  అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులకు బంపర్ బొనాంజా ఆఫర్ చేసింది. దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్, ఉచిత డాటాను అఫర్ చేస్తోంది. 'బీబీజీ కాంబో ప్లాన్'  పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో వినియోగదారులు నెలకు రూ.1199  దేశంలో లోకల్ , ఎస్టీడీ కాల్స్ 24గంటలు ఉచితం, దీంతోపాటు  అన్ లిమిటెడ్ డాటా ఆఫర్ అందిస్తోంది.  మరిన్ని వివరాలకోసం ఈ పట్టికను గమనించండి.


 

Advertisement
 
Advertisement
Advertisement