సెంట్రల్‌ విస్తా ఇకపై కర్తవ్య భవన్‌ ఏరియా | Central Vista to be known as Kartavya Bhawan Area | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ విస్తా ఇకపై కర్తవ్య భవన్‌ ఏరియా

Jul 13 2026 5:41 AM | Updated on Jul 13 2026 5:41 AM

Central Vista to be known as Kartavya Bhawan Area

పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: సెంట్రల్‌ విస్టా పునరభివృద్ధి ప్రాంతాన్ని కర్తవ్య భవన్‌ కాంప్లెక్స్‌ లేదా కర్తవ్య భవన్‌ ఏరియాగా పేరు మార్చినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఆదివారం ప్రకటించారు. సెంట్రల్‌ విస్టా పేరును ఇకపై వినియోగించబోమన్నారు. అన్ని అధికారిక పత్రాలు, ప్రస్తావనల్లోనూ కొత్త పేర్లే ఉంటాయని వివరించారు.

 2022లో కేంద్రం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు గల ప్రాంతానికి కర్తవ్య పథ్‌ అని నామకరణం చేశారు. సెంట్రల్‌ విస్టా పునరభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో వేర్వేరు మంత్రిత్వ శాఖలకు కేంద్రం కొత్తగా 10 భవనాలను నిర్మించతలపెట్టింది. ఇందులో మూడింటి నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాంతానికి కర్తవ్య భవన్‌ జోన్‌గా కేంద్రం నామకరణం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement