breaking news
Minister for Home Affairs
-
సెంట్రల్ విస్తా ఇకపై కర్తవ్య భవన్ ఏరియా
న్యూఢిల్లీ: సెంట్రల్ విస్టా పునరభివృద్ధి ప్రాంతాన్ని కర్తవ్య భవన్ కాంప్లెక్స్ లేదా కర్తవ్య భవన్ ఏరియాగా పేరు మార్చినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆదివారం ప్రకటించారు. సెంట్రల్ విస్టా పేరును ఇకపై వినియోగించబోమన్నారు. అన్ని అధికారిక పత్రాలు, ప్రస్తావనల్లోనూ కొత్త పేర్లే ఉంటాయని వివరించారు. 2022లో కేంద్రం రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు గల ప్రాంతానికి కర్తవ్య పథ్ అని నామకరణం చేశారు. సెంట్రల్ విస్టా పునరభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో వేర్వేరు మంత్రిత్వ శాఖలకు కేంద్రం కొత్తగా 10 భవనాలను నిర్మించతలపెట్టింది. ఇందులో మూడింటి నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాంతానికి కర్తవ్య భవన్ జోన్‌గా కేంద్రం నామకరణం చేసింది. -
దళితుల కోసం ఆరు ప్రత్యేక కోర్టులు ఆర్.ఆర్.పాటిల్
సాక్షి, ముంబై: దళితుల కోసం ఆరు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించారు. అహ్మద్‌నగర్ జిల్లా జామ్ఖేడ్ తాలూకా ఖర్డా గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన దళిత యువకుడు నితిన్ కుటుంబసభ్యులను పాటిల్ పరామర్శించారు. సుమారు 15 నిమిషాల పాటు చర్చలు జరిపి వారి కుటుంబ సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం పాటిల్ మీడియాతో మాట్లాడుతూ నితిన్‌ను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించేలా చూస్తామని చెప్పారు. ఈ కేసును వాదించేందుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమిస్తామన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ కేసు తీర్పు త్వరగా వచ్చేలా కృషి చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న దళితుల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఆరు కోర్టులను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా సూపరింటెండెంట్ పోలీసు రావ్‌సాహెబ్ శిందేకు ఆదేశాలు జారీ చేశామన్నారు.


