కారు డ్రైవర్‌ అరుదైన రికార్డు | Car Driver Rare Record Tamil Nadu | Sakshi
Sakshi News home page

కారు డ్రైవర్‌ అరుదైన రికార్డు

Jul 17 2021 7:43 AM | Updated on Jul 17 2021 8:16 AM

Car Driver Rare Record Tamil Nadu - Sakshi

కార్తియమూర్తికి సర్టిఫికెట్‌ అందజేస్తున్న విమలన్‌ నీలమేఘం

కారైకుడిలో కారు డ్రైవర్‌ అరుదైన రికార్డు సాధించాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని పుదువయల్‌ నాట్టుచేరి గ్రామానికి చెందిన కార్తియమూర్తి (37) కారు డ్రైవర్‌. ఇతను గురువారం 1,330 తిరుక్కురల్‌ను 17 గంటల 19 నిమిషాల్లో తలకిందులుగా రాసి చోళన్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పుస్తకంలో స్థానం సంపాదించుకున్నాడు.

టీ.నగర్‌: కారైకుడిలో కారు డ్రైవర్‌ అరుదైన రికార్డు సాధించాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని పుదువయల్‌ నాట్టుచేరి గ్రామానికి చెందిన కార్తియమూర్తి (37) కారు డ్రైవర్‌. ఇతను గురువారం 1,330 తిరుక్కురల్‌ను 17 గంటల 19 నిమిషాల్లో తలకిందులుగా రాసి చోళన్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పుస్తకంలో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను వ్యవస్థాపకుడు విమలన్‌ నీలమేఘం అందజేశారు.

దీనిపై కార్తియమూర్తి మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బస్సు టికెట్లలో తిరుక్కురల్‌ను చదువుతూ వచ్చానని, దానిపై ఆసక్తి పెంచుకున్న తాను అప్పట్లో 1,330 పద్యాలను తలకిందులుగా రాసినట్లు తెలిపాడు. ఇందుకు 15 రోజులు సమయం పట్టిందన్నాడు. ప్రస్తు తం వళ్లువర్‌ పేరవై సహకారంతో తిరుక్కురల్‌ను 17 గంటల 19 నిమిషాల్లో ముగించి రికార్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement