విమానయాన, ఇంధన సంస్థలకు గుడ్‌ న్యూస్‌: కేబినెట్‌ కీలక నిర్ణయం | Cabinet Approves Rs 10000 Crore Jet Fuel Price Stabilisation Fund | Sakshi
Sakshi News home page

విమానయాన, ఇంధన సంస్థలకు గుడ్‌ న్యూస్‌: కేబినెట్‌ కీలక నిర్ణయం

Jun 3 2026 4:37 PM | Updated on Jun 3 2026 6:04 PM

Cabinet Approves Rs 10000 Crore Jet Fuel Price Stabilisation Fund

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ చేసిన యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌ సంక్షోభం నెలకొంది. వంటగ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ సహా, విమాన ఇంధన ధరలు  భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర  క్యాబినెట్‌  కీలక నిర్ణయం  తీసుకుంది.విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.10,000 కోట్లకు కేంద్రం ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని  సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీని వల్ల విమానయాన సంస్థలకు భారీ ప్రయోజనంసమకూరుతుందని తెలిపారు.

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఏటీఎఫ్ (ATF) ధరల స్థిరీకరణ మద్దతును అందించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (OMCలు) రూ.10,000 కోట్లకు మించని బడ్జెట్ మద్దతును ఆమోదించింది. ఈ బడ్జెట్ మద్దతు, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ద్వారా వడ్డీ లేని అడ్వాన్సుల రూపంలో ఉంటుంది. ఈ నిర్ణయం విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, ఎంఆర్‌ఓలు, ట్రావెల్ ఏజెన్సీలు, ఆతిథ్య , లాజిస్టిక్స్ రంగాలలో ఉపాధి రక్షణకు తోడ్పాటు నందిస్తుందని ప్రకటించారు. అలాగే వ్యాపార ప్రయాణికులు, పర్యాటకుల రాకపోకలను సులభతరం చేస్తుందన్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని 2.5 రెట్లు పెంచాల్సి వచ్చిందని, మార్చి 2026లో లీటరుకు రూ.60.5, మే 2026లో లీటరుకు రూ.142కు చేరిందని వైష్ణవ్ పేర్కొన్నారు. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులలో ATFdr దాదాపు 40 శాతం వాటా. ఏటీఫ్‌ ధరల పెరుగుదల విమానయాన సంస్థలు , చమురు మార్కెటింగ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిందని కానీ ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మేలు జరుగుతందని  సమాచార మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement