వైరల్‌: కొంచెం ఉంటే వారి ప్రాణాలు గాల్లో కలిసేవి..

A Building Collapsed On Road In Madhya Pradesh - Sakshi

తృటిలో తప్పిన ప్రాణాపాయం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని డాటియా జిల్లాలో పీతాంబర పట్టణంలో వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పేకమేడలా కూలి పోయింది. పెళపెళ మంటూ పెద్ద శబ్ధంతో నడిరోడ్డుపై ఆ ట్యాంక్‌ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డు మీదున్న నడుస్తున్న జనాలు రెప్పపాటులో పక్కకు తప్పుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ ఈ పురాతన ట్యాంక్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నెట్టింట ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోని నెటిజన్లు తెగ చూస్తున్నారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top