ఉమా భారతి: అధికారులున్నది చెప్పులు మోయడానికే! | BJP Ex MP Uma Bharti Said Bureaucrats There To Pick Up Your Slippers | Sakshi
Sakshi News home page

Uma Bharti: అధికారులున్నది చెప్పులు మోయడానికే!

Sep 21 2021 10:23 AM | Updated on Sep 21 2021 11:28 AM

BJP Ex MP Uma Bharti Said Bureaucrats There To Pick Up Your Slippers - Sakshi

భోపాల్‌: ప్రభుత్వాధికారులున్నది నాయకుల చెప్పులు మోయడానికేనంటూ కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘అధికారుల గురించి మీకేమీ తెలియదు. వారున్నది మా స్లిప్పర్లు మోయడానికే’ అని ఉమ వ్యాఖ్యానించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన వ్యాఖ్యలపై ఆ తర్వాత ఉమా స్పందించారు. ఓబీసీ నేతలతో పిచ్చాపాటీ మాటల్లో ఈ వ్యాఖ్యలు చేశానని , నిజానికి తాను అధికారులను వెనుకేసుకొచ్చానని సమర్ధించుకున్నారు. నిజాయతీ ఉన్న అధికారులు బలమైన నాయకులకు మద్దతుగా ఉంటారన్నారు. అయితే తన భావన మంచిదైనా, వాడిన భాష బాగోనందున విచారిస్తున్నానని వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement