కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ

BJP Chief Saying If Not Voting For BJP Than Vote For Congress - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ  ఎన్నికల ప్రచార ర్యాలీలో బీజేపీ నాయకుడు అశ్వనీ శర్శ బీజేపీకి ఓటు వేయకపోతే కాంగ్రెస్‌కి వేటు వేయండి కానీ ఆప్‌కి ఓటు వేయకండి అని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవ్వడంతో అశ్వనీ శర్మ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. "ఆప్‌కి ఓటేస్తే ఉగ్రవాదానికి ఓటే వేయడమే.. పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి వేసిన ఓటు.. ఆప్‌కి ఓటేస్తే దేశానికి, పంజాబ్‌కు ద్రోహం చేసినట్టే.. మాకు (బీజేపీ) ఓటు వేయకూడదనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి, దేశానికి ద్రోహం చేసే వారికి ఓటు వేయవద్దు" అని అన్నానంటూ వివరణ ఇచ్చారు.

అంతేకాదు తన వ్యాఖ్యాలను తప్పుడు అవగాహనతో అర్థంచేసుకుంటున్నారంటూ ఆరోపించారు. అబద్దాలను ప్రచారం చేయడం కాగ్రెస్‌కు ఎప్పుడూ ఉన్న అలవాటే అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు నా ప్రకటనను వక్రీకరించారన్నారు. పంజాబ్‌కి ఆప్‌, కాంగ్రెస్‌లు రెండు మేలు చేయవు, ప్రమాదకరమైనవే, కమలం బటన్‌ నొక్కి బీజేపీకి మీ అమూల్యమైన ఓటు వేయండి అని మరోక వీడియాలో తన వ‍్యాఖ్యల పై వివరణ ఇస్తూ పేర్కొన్నారు. అంతేకాదు మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది.

(చదవండి:  కేజ్రీవాల్‌పై కేసు నమోదు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top