తలకు తుపాకీ గురి పెట్టి మరీ.. బలవంతంగా పెళ్లి చేశారు | Bihar Nalanda District Man Taken Hostage Married Off Forcefully | Sakshi
Sakshi News home page

తలకు తుపాకీ గురి పెట్టి మరీ.. బలవంతంగా పెళ్లి చేశారు

Nov 21 2021 11:33 AM | Updated on Nov 21 2021 11:41 AM

Bihar Nalanda District Man Taken Hostage Married Off Forcefully - Sakshi

మార్గమధ్యంలో ఆయుధాలు ధరించి ఉన్న కొందరు వ్యక్తులు నితీష్‌ను కిడ్నాప్‌ చేశారు

పట్నా: ఇంట్లో పండగ చేసుకోబోతున్నారు.. అందుకని బంధువులను ఆహ్వానించడం కోసం పొరుగురికి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ అతడికి అనుకోని వింత అనుభవం ఎదురయ్యింది. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిని బంధించి.. తలకు తుపాకీ గురి పెట్టి బెదిరించి.. ఏకంగా పెళ్లి చేశారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే.. బాధితుడిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. ఆ వివరాలు..
(చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..)

బిహార్‌ నలంద జిల్లా, ధనుకి గ్రామానికి చెందిన నితీష్‌ కుమార్‌ ఛథ్‌ పండుగకు రమ్మని ఆహ్వానించడం కోసం నవంబర్‌ 11న వదిన వాళ్ల ఊరికి వెళ్లాడు. వారిని కలిసి.. పండుగకు రావాల్సిందిగా ఆహ్వానించి.. ఇంటికి తిరిగి బయలు దేరాడు.

అలా వస్తుండగా.. మార్గమధ్యంలో ఆయుధాలు ధరించి ఉన్న కొందరు వ్యక్తులు నితీష్‌ను కిడ్నాప్‌ చేశారు. సరాసరి పెళ్లి మంటపానికి తీసుకెళ్లి.. అతడిని పెళ్లి కుమారుడిగా అలంకరించారు. ఈ క్రమంలో నితీష్‌ అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. అతడిని కొట్టారు. అంతటితో ఆగక తుపాకీతో నితీష్‌ తలకు గురిపెట్టి.. బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారు. 
(చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’)

ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న నితీష్‌.. జరిగిన సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

చదవండి: భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement