నడిరోడ్డుపై యువతి హల్‌చల్‌ | Bhubaneswar: Women Attacks Young Man On Main Road | Sakshi
Sakshi News home page

యువకుడిపై రాళ్లతో దాడి

Nov 18 2020 9:44 AM | Updated on Nov 18 2020 9:47 AM

Bhubaneswar: Women Attacks Young Man On Main Road - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: రాజధాని నగరం నడి బొడ్డున ఓ యువతి దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆమె రాళ్లు రువ్వి యువకుడి తలను బలంగా గాయ పరిచింది. రక్తసిక్తమైన పరిస్థితుల్లో యువకుడు నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. ఈ సంఘటన పూర్వాపరాలు స్పష్టం కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి రాళ్లతో దాడి చేసిన యువతి కనుమరుగైంది. స్థానిక రాజమహల్‌ ఛక్‌ ప్రాంతంలో మంగళవారం పట్టపగలు ఈ సంఘటన జరగడం తీవ్ర సంచలనం రేపింది. చదవండి: ప్రాణం తీసిన పబ్‌జీ..

వివాహిత హత్య!
గంట్యాడ: మండలంలోని కె.వెలగాడ గ్రామంలో ఓ వివాహిత మంగళవారం హత్యకు గురైంది. దీనికి సంబంధించి రూరల్‌ సీఐ మంగవేణి తెలిపిన వివరాలు... కె.వెలగాడ గ్రామానికి చెందిన మర్రోతు భవాని(38)కి గింజేరు గ్రామానికి చెందిన శ్రీరామమూర్తితో 20 ఏళ్ల కిందట వివాహమైంది. ఓ బిడ్డ కూడా పుట్టాడు. తరువాత భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో భవాని  కె.వెలగాడలో కన్నవారింటికి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో మృతురాలికి గ్రామంలోని చౌడవాడ ఎర్రిబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే నేపథ్యంలో ఎర్రిబాబు తనతో కాదని భవానికి వేరొకరితో కూడా సంబంధం ఉన్నట్టు అనుమానించి హత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తలపై పారతో కొట్టి హత్య చేశాడు. పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారం..

విషయం తెలుసుకున్న సీఐ మంగవాణితో పాటు ఎస్‌ఐ బి.గణేష్‌ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పారతో హత మార్చినట్టు ఒప్పుకున్నట్టు తెలిపారు.  హత్యకు వాడిన పారను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి భార్య కూడా గతంలో అనుమానాస్పద స్థితిలో బావిలో పడి మృతి చెందినట్టు వెల్లడించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలించాయి. మృతురాలికి ఇరవై సంవత్సరాల వయసు గల కొడుకు భరత్‌ ఉన్నాడు. మృతురాలి తండ్రి మల్లునాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది.       

Advertisement
 
Advertisement
Advertisement