వైరల్‌ వీడియో: ఎలుగుబంటి చేజ్‌.. థ్రిల్‌ అవ్వాలంటే చివరి వరకు చూడండి!

Bear Charges At Tamil Nadu Biker In Hair Raising Viral Video - Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా తాజాగా తన ట్విటర్‌లో ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశారు. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఎలుగుబంటి వెంటాడుతున్న ఈ వీడియో తమిళనాడులోని నీలగిరి పర్వతాల ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింటా వైరల్‌గా మారింది. కొండల నడుమ టీ గార్డెన్‌లో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి తన ప్రయాణాన్ని వీడియో తీశాడు. చుట్టు పక్కల మొత్తం పచ్చటి ప్రకృతి నిండిన ఆ దారిలో వెళతుండగా ఆ వ్యక్తికి అనుకోని అతిథి ఎదురయ్యింది.

రోడ్డు మీద మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. ఆ దారిలో ఎవరూ వెళ్లకుండా అవి రోడ్డును ఆక్రమించినట్లు కనిపిస్తోంది. వాటిని చూడగానే ఆ వ్యక్తి వెంటనే బైక్‌ ఆపాడు. ఎలుగుబంట్లను రికార్డ్‌ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అయితే అలా కాసేపు అంతా ప్రశాంతంగా ఉన్నా.. ఇందులో ఓ ఎలుగుబంటి బైకర్‌ను గమనించింది. కొద్ది సెకన్లు గడిచాక ఆ ఎలుగుబంటి వ్యక్తి వైపు పరిగెత్తుకు రావడం మొదలైంది. అయితే  ఒక్కసారిగా అతనివైపు పరుగులు తీయడంతో వీడియో పూర్తి అయింది.

ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి. జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి’ అని కామెంట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. పైగా వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు. 

చదవండి: వైరల్‌: రెప్పపాటులో ఎంత పద్ధతిగా కూలిందో చూడండి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top