Ram Mandir: ‘నా సోదరులు కన్న కల నిజమైంది!’

Ayodhya 1990 firing victims Sister Felt Before 2014 Brothers Sacrifice Wasted - Sakshi

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రామ జన్మభూమితో తన కుటుంబ సభ్యులకు ఎంతో అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి ఆనందం వ్యక్తం చేశారు. 1990లో అయోధ్యలో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు చోటుచేసుకున్న పోలీసు కాల్పుల్లో 23 ఏళ్ల రామ్‌ కుమార్‌ కొఠారి, 20 ఏళ్ల శరత్‌ కుమార్‌ కొఠారి మృతి చెందారు. వారి సోదరే పూర్ణిమ కొఠారి. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

ఇన్ని రోజుల తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మితం కావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 2014 వరకు కూడా రాముడి జన్మభూమికి సంబంధించి తన సోదరుల ప్రాణ త్యాగం వృథా అయిందని బాధపడినట్లు చెప్పారు. 33 ఏళ్ల క్రితం తమ ప్రాణాలు త్యాగం చేసిన తన సోదరులు కళ నేడు నిజమవుతోందని అన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని జీవితంలో మరిచిపోనని తెలిపారు.

గత 33 ఏళ్లలో రామ మందిరం నిర్మితం కావటం తనకు చాలా ఆనందించదగ్గ విషయమని పూర్ణిమా అన్నారు. తన తల్లిదండ్రులు కూడా చనిపోయారని తెలిపారు. రామ మందిర నిర్మాణం అవుతుందనే నమ్మకం.. 2014 ముందు వరకు కూడా తనలో లేదని అన్నారు. వేల ఏళ్ల చరిత్ర గల రామ మందిరం నిర్మాణంలో తన సోదరులు ప్రాణ త్యాగం ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. రామ మందిర నిర్మాణం పట్ల తాను చాలా గర్వ పడుతున్నాని తెలిపారు.

కొల్‌కత్‌కు చెందిన రామ్‌కొఠారి, శరత్‌ కొఠారి 1990 అక్టోబర్‌లో కరసేవకులు చేపట్టిన యాత్రలో పాల్గొన్నారు. అయితే వారు కోల్‌కతా నుంచి ప్రారంభం కాగా.. వారి  బృందం బెనారస్‌ వరకు చేరుకోగానే పోలీసులు నిలువరించారు. ఇక వారు అక్కడి నుంచి టాక్సిలో ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి:  కాలారామ్‌ గుడికి ప్రధాని మోదీ.. ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top