క్యాన్సర్‌తో భార్య మృతి.. నిమిషాల్లో ఐపీఎస్‌ భర్త సూసైడ్‌ | Assam IPS Officer Shiladitya Chetia Dies By Suicide | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌తో భార్య మృతి.. వెంటనే ఐపీఎస్‌ భర్త సూసైడ్‌

Published Tue, Jun 18 2024 6:39 PM | Last Updated on Tue, Jun 18 2024 7:08 PM

Assam IPS Officer Shiladitya Chetia Dies By Suicide

గువహతి: భార్య క్యాన్సర్‌తో  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మరణించింది. ఈ విషయాన్ని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్‌ ఫోన్‌ చేసి చెప్పారు. ఈ బాధను దిగమింగుకోలేక భార్య చనిపోయిన వార్త తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. 

ఈ విషాద ఘటన మంగళవారం(జూన్‌18) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్‌ హోమ్‌ అండ్‌ పొలిటికల్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ శైలాదిత్య చెటియా(2009బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

భార్య క్యాన్సర్‌తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయినట్లు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement