97 ఏళ్ల వయసులో రెక్కలు కట్టుకుని...! | Anand Mahindra shares amazing video says she is my hero | Sakshi
Sakshi News home page

97 ఏళ్ల వయసులో రెక్కలు కట్టుకుని...!

Published Thu, Nov 23 2023 2:23 PM | Last Updated on Thu, Nov 23 2023 3:29 PM

Anand Mahindra shares amazing video says she is my hero - Sakshi

ఆసక్తి , పట్టుదల ఉండాలే గానీ వయసుతో పనేముంది. ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు.. ఎంత రిస్క్‌ అయినా చేయొచ్చు. బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు.  97ఏళ్ల వయసులో ఈ పెద్దావిడ  సాహసం, తెగువ  చూస్తే మీరు కూడా  ఇలాగే అనుకుంటారు.  ఈ బామ్మకు  సెల్యూట్‌ చేయకుండా ఉండరు!

అందుకే పారిశ్రామికవేత్త,  ఎంఅండ్‌ఎం అధినేత ఆనంద్‌ మహీంద్రను కూడా బామ్మ బాగా ఆకట్టుకుంది. ఆమే నా హీరో అంటూ ఈ వీడియోను ట్విట్‌ చేశారు. దీంతో నెటిజన్లు బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పువ్వులా నేనే...నవ్వుకోవాలి....గాలినే నేనై... సాగిపోవాలి చిన్నిచిన్నిఆశ.. అంటూ సాగే తమిళ బ్యాగ్‌ గ్రౌండ్‌ పాటతో ఈ వీడియో మరింత హృద్యంగా నిలిచింది.  అనుకున్న పని సాధించాలంటే వయసుతో పని ఏముంది సార్‌..అని ఒకరు, అద్భుతమైన వీడియో, బామ్మకు అభినందనలు మరికొందరు  నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.  

ఫ్లయింగ్ రైనో పారామోటరింగ్ అనే ఇన్‌స్టా పేజ్‌ ఈ వీడియోను ఇటీవల షేర్‌ చేసింది.  97 ఏళ్ళ వయసులో ఎగిరే ప్రయత్నం చేసిన, సక్సెస్‌ అయిన ఈ బామ్మ ధైర్యానికి సెల్యూట్‌ అని పేర్కొంది.  మహారాష్ట్ర  జెజురి పట్టణంలోని కొండపై ఉన్న ఖండోబా ఆలయం సమీపంలో ఈ ఫీట్‌ చేశారు బామ్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement