హిందీలో ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలు

Amit Shah releases textbooks in Hindi for MBBS students - Sakshi

విడుదల చేసిన అమిత్‌ షా

భోపాల్‌: వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన  ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎంబీబీఎస్‌ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్‌ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు.

ఆదివారం భోపాల్‌ మంత్రి అమిత్‌ షా ఎంబీబీఎస్‌లోని మెడికల్‌ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్‌ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. సాంకేతిక, వైద్య విద్యను మరో 8 భాషల్లోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంగ్లిష్‌  తమకు రాదనే ఆత్మనూనతతో విద్యార్థులు బాధపడాల్సిన పనిలేదన్నారు. మాతృభాషల్లోనూ విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాలను 97 మంది వైద్యులతో కూడిన బృందం రూపొందించిందని సీఎం చౌహాన్‌ చెప్పారు. కాగా, ఎంబీబీఎస్‌ పాఠ్యపుస్తకాలను హిందీలో తీసుకురావడం వైద్యవిద్యలో సానుకూల పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top