ఆస్పత్రి నుంచి అమిత్‌ షా డిశ్చార్జ్‌ | Amit Shah Discharged From AIIMS Delhi Admitted Post Covid 19 | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ నుంచి అమిత్‌ షా డిశ్చార్జ్‌

Aug 31 2020 9:56 AM | Updated on Aug 31 2020 2:30 PM

Amit Shah Discharged From AIIMS Delhi Admitted Post Covid 19 - Sakshi

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాను జయించిన అనంతరం అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కాగా ఈ నెల 2న అమిత్‌ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన.. కరోనా నుంచి కోలుకుని ఆగస్ట్‌ 14న ఇంటికి వచ్చారు. అయితే ఒళ్లు నొప్పులు, నిస్సత్తువ తగ్గకపోవడంతో ఆగష్టు 18న అమిత్‌ షా ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో చేరారు. అత్యుత్తమ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. ఈ క్రమంలో ఆయనను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.(చదవండి: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement