ఎయిరిండియా మహిళా సిబ్బందిపై దాడి | Air India crew member allegedly assaulted in London hotel room | Sakshi
Sakshi News home page

లండన్‌ హోటల్‌లో ఎయిరిండియా మహిళా సిబ్బందిపై దాడి

Aug 18 2024 11:25 AM | Updated on Aug 18 2024 11:29 AM

Air India crew member allegedly assaulted in London hotel room

ఢిల్లీ:లండన్‌లోని ఓ హోటల్‌లో ఎయిరిండియాకు చెందిన మహిళా సిబ్బందిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈ విషయాన్ని  ఆదివారం ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘లండన్‌లో ఎయిరిండియా క్యాబిన్ క్రూ మెంబర్‌ బస చేసిన హోటల్ రూమ్‌లో గుర్తు తెలియని దుండగుడు అక్రమంగా చొరబడి దాడికి తెగబడ్డాడు. ఆమెపై దాడి చేశాడు.  సమాచారం అందిన వెంటనే స్పందించాం. ఆమెకు, ఆమె సహోద్యోగులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నాం’ అని ఎయిరిండియా పేర్కొంది.

గురవారం రాత్రి లండన్‌లోని రాడిసన్ రెడ్ హోటల్‌ రూంలో చొరబడి దాడికి తెగబడిన నిందితుడి అరెస్ట్‌ చేసినట్లు.. అతను నైజీరియా దేశానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన ప్రస్తుతం లండన్ పోలీసుల విచారణలో ఉందని, సిబ్బంది గోప్యతను గౌరవించాలని అక్కడి అధికారులకు ఎయిర్ ఇండియా విజ్ఞప్తి చేసింది. ఈ  ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా స్థానిక అధికారులు సహకారం అందిచాలని ఎయిరిండియా కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement