కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. ఉప ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి విజయం | AINRC Ashok Anand Wins Thattanchavady Bypoll in Puducherry | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. ఉప ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి విజయం

Oct 9 2026 11:50 AM | Updated on Oct 9 2026 11:56 AM

AINRC Ashok Anand Wins Thattanchavady Bypoll in Puducherry

పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని థట్టాంచావడి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (AINRC) అభ్యర్థి అశోక్ ఆనంద్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఈ. వినయాగంపై 8,482 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భారత ఎన్నికల సంఘం వెల్లడించిన తుది గణాంకాల ప్రకారం అశోక్ ఆనంద్‌కు 13,358 ఓట్లు రాగా, వినయాగానికి 4,876 ఓట్లు వచ్చాయి.

కాగా, ఈ ఉప ఎన్నిక ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కు కీలకంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో AINRC భాగస్వామిగా ఉంది. గతంలో ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి, AINRC వ్యవస్థాపకుడు ఎన్. రంగస్వామి ప్రాతినిధ్యం వహించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో థట్టాంచావడి, మంగళం రెండు స్థానాల్లోనూ గెలిచిన రంగస్వామి.. మంగళం స్థానాన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకోవడంతో థట్టాంచావడికి ఉప ఎన్నిక జరిగింది. 

థట్టాంచావడి నియోజకవర్గం చాలాకాలంగా రంగస్వామితో అనుబంధం కలిగి ఉంది. తాజా విజయంతో ఈ స్థానాన్ని AINRC తిరిగి దక్కించుకుంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి ఈ ఫలితం మరో ప్రాతినిధ్యాన్ని అందించింది. ఆనంద్‌ విజయం నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆనందంతో సంబురాలు చేసుకుంటూ స్వీట్స్‌ పంచారు. పార్టీ ఆఫీసు వద్ద సందడి నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో డీఎంకే సైతం పోటీలో ఉన్నప్పటికీ ప్రభావం చూపించలేకపోయింది. 

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">#WATCH | Puducherry | All India N.R. Congress workers celebrate as their leader Ashok Anand leads in Thattanchavady (Puducherry) Assembly by-polls results, as per early ECI trends https://t.co/QdsOcnDog2</p>&mdash; ANI (@ANI) <a href="https://x.com/ANI/status/2108431759574753289?ref_src=twsrc%5Etfw">October 9, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script> 

ఇదీ చదవండి: కలెక్టర్‌గా తొలిసారి పోస్టింగ్‌.. రాత్రికి రాత్రే పోస్టింగ్‌ మార్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement