
రోజూ 70 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకరం. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మరణాల రేటు తక్కువగా ఉండటం సానుకూల అంశం.
న్యూఢిల్లీ: కరోనా కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్‌లో రోజూ 70 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకరం. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మరణాల రేటు తక్కువగా ఉండటం సానుకూల అంశం. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్ కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది.
కరోనా రోగుల్లో కొత్తగా 65,081 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,85,996. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల రికవరీ రేటు 76.94 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల రేటు 1.77 శాతంగా ఉందని వెల్లడించింది. ఇదిలాఉండగా... 62 లక్షల కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో 39 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.
(చదవండి: ఇమ్యూనిటీ ఏమో గాని.. ఇబ్బందులే సుమా! )