న్యూఢిల్లీ: జీమెయిల్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, నెట్‌ఫ్లిక్స్‌లకు చెందిన 14.9 కోట్ల అకౌంట్ల యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు సహా పూర్తి వివరాలు లీకైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. జెరెమియా ఫౌలర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయం తెలిపినట్లు ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ పేర్కొంది. డేటా బయటకు పొక్కిన వాటిలో 4.8 కోట్ల జీమెయిల్ అకౌంట్లు, యాహూకు చెందిన 40 లక్షలు, 1.7 కోట్ల ఫేస్‌బుక్ అక్కౌంట్లు, 65 లక్షల ఇన్‌స్టా, 34 లక్షల నెట్‌ఫ్లిక్స్, 15 లక్షల ఔట్‌లుక్ తదితర అక్కౌంట్లు ఉన్నట్లు వివరించింది. మొత్తం 96 గిగాబైట్ల డేటా ఇందులో ఉన్నట్లు తెలిపింది. వివిధ దేశాలకు చెందిన ‘.gov ’ అనే డొమైన్లతో ఉండే క్రెడెన్షియల్స్ లీక్ కావడం ప్రధానంగా ఆందోళన కలిగించే అంశమని వెల్లడించింది.


