వంటింట్లో తిష్ట వేసిన 14 అడుగుల కింగ్ కోబ్రా! | 14 foot king cobra spotted in kitchen | Sakshi
Sakshi News home page

వంటింట్లో తిష్ట వేసిన 14 అడుగుల కింగ్ కోబ్రా!

Apr 2 2026 12:51 PM | Updated on Apr 2 2026 12:56 PM

14 foot king cobra spotted in kitchen

కర్ణాటక: రోడ్డు మీద వెళ్తున్న కింగ్‌ కోబ్రా పాము ఇంట్లోకి దూరింది. జిల్లాలోని కాచిబట్టి గ్రామంలో రోడ్డు దాటుతున్న సుమారు 14 అడుగుల గిరినాగు ఒకటి వాహనం తగలడంతో పక్కనే రాజు నాయక్‌ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. వంటింట్లో తిష్టవేసిన అతిథిని చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. అటవీ సిబ్బందికి కాల్‌ చేయగా, వారు మహేశ్‌ నాయక్‌కు చెప్పారు. మహేశ్‌ నాయక్, ఆయన కుమారుడు గగన్‌ నాయక్‌ చాలాసేపు కష్టపడి కింగ్‌ కోబ్రాను క్షేమంగా పట్టుకున్నారు. దానిని  దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement