ఎన్నికల్లో ఓడితేఅక్రమాలు జరిగినట్టా..! | 124 Former IAS, IFS and allied services officers have issued an open letter | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఓడితేఅక్రమాలు జరిగినట్టా..!

Oct 11 2026 5:57 AM | Updated on Oct 11 2026 5:57 AM

124 Former IAS, IFS and allied services officers have issued an open letter

ఎన్నికల్లో ఓడితేఅక్రమాలు జరిగినట్టా..!

గెలిచినప్పుడు ఈసీపై ఫిర్యాదు చేయలేదెందుకు?

ఈసీకి, సర్‌కు మద్దతుగా 124 మంది మాజీ అధికారుల బహిరంగ లేఖ 

విధానాలను గౌరవించాలి..లోపాలను సరిదిద్దాలని పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచినప్పుడు మాట్లాడనివారు, ఓటమి పాలైనప్పుడు మాత్రం రిగ్గింగ్‌ జరిగినట్టు తీవ్ర ఆరోపణలు చేయడాన్ని పలువురు మాజీ బ్యూరోక్రాట్లు తప్పుబట్టారు. ఎన్నికల కమిషన్, సర్‌ ప్రక్రియ, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజకీయ పార్టీలు, పలు సంఘాలు వరుస నిరసనలతో హోరెత్తిస్తున్న వేళ మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, అనుబంధ సేవల అధికారులు మొత్తం 124 మంది శనివారం ఈసీకి, సర్‌ ప్రక్రియకు మద్దతు తెలిపారు.

 ఈ మేరకు దేశ పౌరులకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, జమ్మూకశీ్మర్‌లలో అధికార బీజేపీ పార్టీ ఓటమి పాలైందని, అంతేకాదు 2024 లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌సభలో మెజారిటీ సైతం కోల్పోయిందని ఆ లేఖలో వారు గుర్తు చేశారు. 

అప్పట్లో గెలిచిన రాజకీయ పార్టీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిపిన మాజీ బ్యూరోక్రాట్లు... ఓడినప్పుడు మాత్రం రిగ్గింగ్, అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు. ‘మీకు విజయాలను అందించిన అదే వ్యవస్థ ఓటమి వేళ రిగ్గింగ్‌కు గురైందనడం.. వ్యవస్థపై మీ సందేహమా లేక ఫలితంపై మీకున్న అసంతృప్తా అన్నది ప్రశ్నించుకోవాలి’అని మాజీ అధికారులు పేర్కొన్నారు.  
   
ఆధారాలను చూపాల్సిన బాధ్యతా ఉంది 
ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్‌ జరిగిందంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నప్పటికీ, ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేశారు. అందుకు చట్టపరమైన అనేక మార్గాలున్నాయన్నారు. సంస్థల విశ్వసనీయతను రాజకీయ పార్టీల గెలుపోటములతో ముడిపెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు చేయదని అభిప్రాయపడ్డారు. 
   
సర్‌ సమర్థతకు బిహార్‌ ఉదాహరణ 
సర్‌ ప్రక్రియ ఓటర్లను కాపాడటానికే తప్ప మోసగాళ్లను రక్షించడానికి కాదన్నారు. సర్‌ ప్రక్రియలో బిహార్‌లో 22 లక్షల మంది మరణించిన ఓటర్ల పేర్లు, 7 లక్షల నకిలీ ఎంట్రీలు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన లక్షలాది మంది వివరాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఓటర్ల జాబితాల్లో కొనసాగితే ఇతరులు వారి పేర్లతో ఓటు వేసే అవకాశం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 21.5 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు లేఖలో పేర్కొన్నారు.  
   
అత్యంత అధునాతన వ్యవస్థ  
ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఎన్నికల ప్రక్రియలో లోపాలను గుర్తించి సరిదిద్దడంతో పాటు, చట్టబద్ధమైన విధానాలను గౌరవించాలని మాజీ అధికారులు పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని, తల్లిదండ్రులు, పొరుగువారు, వలస కార్మికుల పేర్లను కూడా పరిశీలించడంలో సహకరించాలని సూచించారు. 

బూత్‌ల ఆక్రమణ, బ్యాలెట్‌ బాక్సుల ట్యాంపరింగ్‌ వంటి గతకాలపు పరిస్థితుల నుంచి భారత ఎన్నికల వ్యవస్థ ఈవీఎంలు, వీవీప్యాట్లు, పటిష్టమైన భద్రతా వలయాలతో అధునాతనంగా మారిందని వారు గుర్తు చేశారు. ఈ లేఖ రాసిన వారిలో విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబాల్, మాజీ ఐఏఎస్‌ ఆర్‌డీ కపూర్, సమీరేంద్ర ఛటర్జీ, గోపాల్‌ కృష్ణ, కె.అరవింద రావు, ప్రభు దయాళ్, వివేక్‌ భరద్వాజ్, నవనీత్‌ సెహ్‌గల్‌ తదితరులు ఉన్నారు.  

అత్యంత కీలకంగా కోర్టులు
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ, దాని ప్రతి దశను పరిశీలించిందని లేఖలో తెలిపారు. ప్రక్రియలో ఏ దశలోనైనా చట్టవిరుద్ధత తేలితే మొత్తం ప్రక్రియను రద్దు చేసే అధికారం కోర్టుకు ఉందని లేఖలో పేర్కొన్నారు. ‘2026 మే 27న ఈసీకి రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఉన్న అధికారాలను కోర్టు సమరి్థంచింది. పొరపాటున తొలగింపునకు గురైన ఓటర్లకు అదనపు రక్షణలు కలి్పంచింది’అని లేఖలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement