breaking news
Rigging elections
-
పోలీసుల ముందే రిగ్గింగ్ కు వెళ్తున్న గూండాలు
-
కర్ణాటక మంత్రి రాజన్న తొలగింపు
బెంగళూరు: కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను సీఎం సిద్ధరామయ్య కేబినెట్ నుంచి తొలగించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ థావర్చంద్ర గహ్లోత్‌కు సోమవారం మధ్యాహ్నం సిఫారసు చేశారు. ఈ సిఫారసుపై గవర్నర్ ఆమోద ముద్ర వేశారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. పదవికి రాజీనామా చేయాలని కోరగా రాజన్న స్పందించలేదని, అందుకే తొలగించారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. సిద్ధరామయ్యకు విధేయుడిగా పేరున్న రాజన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి కారణ మ య్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహదేవపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓట్ల చోరీకి పాల్పడ్డారంటూ సొంత పార్టీ నేతలపై ఆరోప ణలు చేయడం కలకలం రేపింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీకి దిగిందంటూ ఇటీవల తీవ్ర విమర్శలు చేస్తుండటం తెల్సిందే. అయితే, సోమవారం ఉదయం మంత్రి రాజన్న మీడియా ఎదుట తమ పార్టీ హయాంలో ఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితా సవరణలను పార్టీ నేతలు సరిగ్గా పరిశీలించకపోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటరు జాబితా తయారీ సమయంలో మౌనంగా ఉన్నారని ఆరోపించారు. దీంతో, ఒకే వ్యక్తి పేరు మూడు చోట్ల కనిపించిందని, తక్కువ మంది ఉండే చాలా ప్రాంతాల్లో అనుమానాస్పద పేర్లను జత చేశారని పేర్కొన్నారు. మంత్రి రాజన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, నేత రాహుల్ సహా అగ్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వెంటనే ఆయన్ను రాజీనామా చేయాలని తాఖీదులు పంపింది. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చినట్లయింది. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదని రాజన్న వ్యాఖ్యలతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. తప్పు ఎత్తి చూపినందుకు ఎస్టీ వర్గానికి చెందిన రాజన్నతో బలవంతంగా రాజీనామా చేయించారంది. నిజం మాట్లాడితే కాంగ్రెస్ శిక్ష రాజీనామాయే అని బీజేపీ ఎంపీ మోహన్ వ్యాఖ్యానించారు. నిజాన్ని అంగీకరించే ధైర్యం కాంగ్రెస్‌పార్టీకి లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. ఓట్ల చోరీ బీజేపీ హయాంలో జరిగిందని రాహుల్ ఆరోపిస్తుండగా, సీఎం సిద్ధరామయ్య హయాంలో అవకతవకలు జరిగినట్లు తాజాగా రుజువైందన్నారు. ఇందుకు రాహుల్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఈ ముగ్గురిలో ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రాజన్న వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
బదులివ్వకుండా బెదిరింపులా?
బెంగళూరు: దేశంలో ముమ్మాటికీ ఓట్ల చౌర్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలపై తాను గణాంకాలు విడుదల చేసిన తర్వాత ప్రజలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దాంతో దిక్కుతోచని ఎన్నికల సంఘం సంబంధిత వెబ్‌సైట్‌ను మూసివేసిందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్‌లో ఈసీ వెబ్సైట్లు మూతపడ్డాయని తెలిపారు. ఎన్నికల బాగోతాలపై ప్రజలంతా నిలదీయడం ప్రారంభిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఈసీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు అధికార్ ర్యాలీ’లో రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చేతబూని ప్రసంగించారు. తాను చేసిన ఆరోపణలు నిజమని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ప్రమాణం చేయాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్లో భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశానని వ్యాఖ్యానించారు. మళ్లీ ఈసీ ఎదుట ప్రమాణం చేయాలా? అని మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి రాహుల్ ఐదు ప్రశ్నలు సంధించారు. తనను బెదిరించడం పక్కనపెట్టి, వాటికి సమాధానం చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... కొత్త ఓట్లన్నీ బీజేపీకే... ‘‘మోదీ గత లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో రిగ్గింగ్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. దేశవ్యాప్తంగా ఎల్రక్టానిక్ ఓటర్ డేటా మాకు అందజేస్తే.. ప్రధానమంత్రి పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మా కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంది. కేవలం నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకలా జరిగిందో ఆరా తీస్తే కోటి మంది కొత్త ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తేలింది. 4 నెలల్లోనే కోటి మంది ఎలా ఓటర్లయ్యారు? ఆ కొత్త ఓట్లన్నీ బీజేపీకే పడ్డా యి. భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదైన చోట బీజేపీ గెలుస్తోంది. దీని వెనుక మతలబు ఏమిటి? రాజ్యాంగంపై మోదీ దాడి కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 16 సీట్లు వస్తాయని అంచనా వేశాం. సర్వేలు కూడా ఇదే విషయం చెప్పాయి. కానీ, 9 సీట్లే వచ్చాయి. అక్కడ ఏదో మాయ జరిగినట్లు తేలిపోయింది. ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్‌లు ఇవ్వాలని అడిగితే తిరస్కరించారు. తర్వాత చట్టాన్ని మార్చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక 45 రోజుల్లో వీడియో ఆధారాలను తొలగిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పూర్తి డేటా ఇవ్వాలి. లేనిపక్షంలో మహాదేవపుర స్థానంలో నిర్వహించినట్లుగానే ఇతర నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశోధన చేస్తాం.ఎప్పటికైనా చర్యలు తథ్యం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు అంగీకరించాలి. అసలేం జరిగిందో చెప్పాలి. వాస్తవాలకు ముసుగేయాలనుకోవడం సరైంది కాదు. ఏదో ఒకరోజు మీరు మమ్మల్ని(ప్రతిపక్షం) ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల కమిషనర్ సహా ప్రతి అధికారీ ఈ విషయం గుర్తించుకోవాలి. రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకుంటామంటే కుదరదు. మీపై చర్యలు తీసుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ, ఎప్పటికైనా చర్యలు మాత్రం తథ్యం. అక్రమార్కులు ఒకరి తర్వాత ఒకరు దొరికిపోవడం ఖాయం. నేను చెప్పేది రాసి పెట్టుకోండి. రాజ్యాంగంపై దాడికి దిగితే మేము మీపై దాడి చేస్తాం’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. ఈసీకి రాహుల్ 5 ప్రశ్నలు1. ఓటర్ల జాబితాలను డిజిటల్ మెషీన్ రీడబుల్ ఫార్మాట్లో ప్రజలకు ఎన్నికల సంఘం ఎందుకు ఇవ్వడం లేదు? 2.ఎన్నికలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? 3.ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఎందుకు జరిగింది? 4.మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప కుండా ఈసీ మమ్మల్ని ఎందుకు బెదిరిస్తోంది? 5.ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంట్‌గా ఎందుకు పనిచేస్తోంది? -
అణు బాంబు లాంటి సాక్ష్యం ఉంది
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఓట్ల చోరీని నిరూపించడానికి తమ వద్ద అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందని స్పష్టంచేశారు. ఈ అణు బాంబు పేలితే దాక్కోవడానికి ఈసీకి దేశంలో ఎక్కడా చోటు దొరకదని అన్నారు. ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న అధికారులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓట్ల చౌర్యంపై తమ వద్ద 100 శాతం సాక్ష్యం ఉందన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐర్) పూర్తయ్యి ముసాయిదా జాబితాను విడుదల చేసిన రోజే ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు గుప్పించడం గమనార్హం. కొందరి ఓట్లు తొలగించడం, కొత్తగా ఓటర్లను చేరి్పంచడం సాధారణ విషయం కాదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసమే ఈ తతంగం సాగుతోందన్నారు. 2023లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, గత ఏడాది జరిగిన లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఓట్ల చౌర్యం జరిగిందన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట ఎన్నికల ముందు కొత్తగా కోట్లాది మంది ఓటర్లను జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం స్పందించలేదని విమర్శించారు. అందుకే తామే సొంతంగా ఆరు నెలలపాటు పరిశోధన చేశామని, అణు బాంబు లాంటి సాక్ష్యం లభించిందని వ్యాఖ్యానించారు. ఓట్లను దొంగతనం చేయడం దేశ ద్రోహం కంటే తక్కువేమీ కాదన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు పదవీ విరమణ చేసి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటామని తేల్చిచెప్పారు. దేశానికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులకు శిక్ష తప్పదన్నారు. రాహుల్ ఆరోపణలు పట్టించుకోవద్దుఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వరుస ప్రకటనలపై ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. బాధ్యతారహితమైన, నిరాధార ఆరోపణలు పట్టించుకోవద్దని.. పారదర్శకంగా, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని తమ అధికారులకు సూచించింది. ఓట్ల చౌర్యం అంటూ ప్రతిరోజూ వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేలి్చచెప్పింది. ఆరోపణల గురించి పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని ఈసీ పేర్కొంది. దేశంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు స్పష్టంచేసింది. -
మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. బిహార్‌లో అలా జరగనివ్వం
పట్నా: 2024లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈసీ చేపట్టిన ఓటరు జాబితా (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర పన్నిందన్నారు. పట్నాలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట బుధవారం ఇండియా కూటమి పార్టీలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. బీజేపీ మహారాష్ట్రలో బోగస్ ఓట్లను భారీగా చేర్పించడం ద్వారా ఫలితాలను అనుకూలంగా మార్చుకుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శించారు. బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు, ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ప్రజల ఓట్లు, ముఖ్యంగా యువత నుంచి ఓటు హక్కును దొంగిలించేందుకు ఈసీ చేసే ప్రయత్నాలను తాము కొనసాగనీయబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతిని చూపుతూ రాహుల్ ప్రసంగించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు చేపట్టిన జాతీయ స్థాయి నిరసనల్లో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ మాదిరిగా తయారైందని దుయ్యబట్టారు. ఓటర్ల జాబితా నుంచి ఇప్పుడు పేర్లు తీసేస్తున్నారు..ఆ తర్వాత రేషన్, పింఛను కూడా రాకుండా చేస్తారంటూ నితీశ్ సర్కార్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ సర్కార్‌కు ఘోర పరాజయం తప్పదన్నారు. అనంతరం సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య కూడా మాట్లాడారు. -
రిగ్గింగ్.. బూత్ క్యాప్చరింగ్.. దొంగ ఓట్లతో గెలిచారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లతో గెలిచిందని ఆ ఎన్నికలో ఓటమి పాలైన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఒక సీటు కోసం ఈ స్థాయికి టీడీపీ దిగజారిపోతుందని ఊహించలేదన్నారు. మంగళవారం ‘సాక్షి ప్రతినిధి’తో లక్ష్మణరావు మాట్లాడుతూ.. దొంగ ఓట్లు గణనీయంగా పని చేశాయన్నారు. ఆలపాటి పేరుకు ముందు వేసిన ఒకటి అనే అంకె దాదాపు 50కిపైగా బ్యాలెట్ పత్రాలపై ఒకేలా కనబడిందని, ఈ ఓట్లన్నీ ఒక్కరే వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో 91 శాతం, దాచేపల్లిలో 88 శాతం, వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 80% కంటే ఎక్కువ ఓట్ల శాతం నమోదయ్యాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లాలోని పలుచోట్ల, ఏలూరు జిల్లాలోని కైకలూరు, నూజివీడులలో దొంగ ఓట్లు, బ్యూత్ క్యాప్చరింగ్‌లు జరిగాయని ఆరోపించారు. నూజివీడులో ముందు రోజున ఓటర్లకు వాల్‌క్లాక్‌లు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారుపలు పోలింగ్ బూత్‌లలో టీడీపీ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని లక్ష్మణరావు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున ఏజెంట్‌ను కూడా కూర్చొనివ్వలేదని చెప్పారు. దుర్గిలో గంటలోపే ఏజెంట్‌ను బయటకు నెట్టేశారన్నారు. బెల్లంకొండలో ఏజెంట్‌ను బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని, తాను అమరావతి పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు ఆ కేంద్రం గేటు వద్ద 200 మంది టీడీపీ నేతలు టెంట్లో ఉన్నారని, వారంతా యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారని పేర్కొన్నారు. అనేకచోట్ల ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి అక్కడ చాలా సమయం గడిపి ఓటింగ్‌ను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, అధికార పార్టీ తన పరపతిని ఉపయోగించి ఓటింగ్‌ను ప్రభావితం చేసిందన్నారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. డిగ్రీ చదవని వారిని కూడా పెద్దఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారన్నారు. భారీ ఎత్తున దొంగ ఓట్లు సైతం వేయించారన్నారు. ఓటువేసే సమయంలో గుర్తింపు కార్డు చూపించకుండానే ఓటర్లను లోపలికి అనుమతించారని ఆరోపించారు. పెనమలూరు వద్ద ఒకే పేరుతో 42 ఓట్లు, మరోచోట ఒకే పేరుతో 10 ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. తెనాలిలోని కోగంటి శివయ్య స్కూల్ వద్ద కూడా ఇదేవిధంగా జరిగిందని, దీనిపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారనన్నారు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రానికి వెళితే ఓ సీఐ ‘సర్.. మీరు వెళ్లండి. ఇక్కడ అంతా మేం చూసుకుంటాం’ అని చెప్పిన విషయాన్ని రికార్డు చేసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనైతికంగా సోషల్ మీడియాలో చివరి నాలుగు రోజులు విపరీతమైన దుష్ప్రచారం చేశారని లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
PAK:ఎన్నికలు రిగ్గింగ్ చేశారు: సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పిటిషన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పార్టీ ఎన్నికల్లో గెలవకుండా రిగ్గింగ్ చేసి ప్రజా తీర్పును దొంగిలించాలని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించారు. తాము బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి తన పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ మొత్తం 180 సీట్లు గెలుచుకుందని, అయితే రిగ్గింగ్ వల్ల ఆ స్థానాలు 92కు పడిపోయాయని ఇమ్రాన్ తెలిపారు. ఇప్పటికే ఎన్నికలు రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఒక ఆర్మీ అధికారికి సుప్రీంకోర్టు జరిమానా విధించిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ వేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. 266 నేషనల్ అసెంబ్లీ సీట్లలో మొత్తం 133 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి కావాల్సిన మెజారిటీ రాలేదు. దీంతో నవాజ్‌షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవర్‌షేరింగ్ ఒప్పందం కూడా ఇప్పటికే కదుర్చుకున్నారు. ఇదీ చదవండి.. అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు -
గెలిచింది నేను కాదు, నాకొద్దీ సీటు
కరాచీ: ఎన్నికల పందేరంలో కోట్లు పంచైనా సరే ఓట్లు ఒడిసిపట్టాలనే నేతలున్న ఈ కాలంలో నువ్వే గెలిచావని ఎన్నికల సంఘం చెబుతున్నా ఒక పాకిస్తాన్ నేత ‘నాకు ఇలాంటి గెలుపు వద్దే వద్దు’ అని తెగేసి చెప్పారు. రిగ్గింగ్‌కు పాల్పడటం ద్వారా తనను గెలిపించారని, వాస్తవానికి విజేత వేరే ఉన్నారని కుండబద్దలు కొట్టారు. సంక్షుభిత పాకిస్తాన్లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలతోపాటు నాలుగు ప్రావిన్షియల్(అసెంబ్లీ) ఎన్నికలు జరిగాయి. వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో పీఎస్–129 నియోజకవర్గం నుంచి జామాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఉర్ రెహ్మాన్ పోటీకి నిలబడ్డారు. అవినీతి కేసుల్లో జైలుపాలైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేత, స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీ కూడా ఇదే స్థానంలో బరిలో నిల్చారు. సైఫ్‌కు 31,000 ఓట్లు రాగా, రెహ్మాన్‌కు 26,000 ఓట్లు పడ్డాయి. అయితే పీటీఐ నేతను ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. సైఫ్‌కు కేవలం 11,000 ఓట్లు పడ్డట్లు ఫలితాల్లో వచ్చేలా చేశారు. ఇదే ఫలితాలను పాక్ ఎలక్షన్ కమిషన్ అసలైనవిగా భావించి రెహా్మన్ను విజేతగా ప్రకటించింది. రిగ్గింగ్ విషయం తెల్సి రెహా్మన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా పత్రికా సమావేశం పెట్టిమరీ తన ధర్మాగ్రహాన్ని వ్యక్తంచేశారు. ‘‘ అన్యాయంగా నన్ను ఎవరైనా గెలిపించాలనుకుంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రజాతీర్పును గౌరవించాల్సిందే. విజేతనే గెలవనివ్వండి. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సిందే. అలాంటి వారికి ఎక్స్‌ట్రాలు అక్కర్లేదు. నేను ఈ గెలుపును స్వీకరించట్లేను. విజేతకే విజయం దక్కాలి’’ అని అన్నారు. రెహ్మాన్ నిజాయతీ చూసి అక్కడి వాళ్లు మెచ్చుకున్నారు. అయితే ఈ ఉదంతంపై పాక్ ఎన్నికల సంఘం మరోలా స్పందించింది. ‘‘ రిగ్గింగ్ అవాస్తవం. ఇలాంటి ఫిర్యాదులపై దృష్టి పెడతాం’’ అని పేర్కొంది. ఈ ఘటనపై త్వరలోనే స్పందిస్తామని పీటీఐ తెలిపింది. -
అడ్డంగా దొరికిపోయిన టీడీపీ.. వీడియో వైరల్
సాక్షి, తిరుపతి: దొంగే దొంగ అన్న చందంగా తయారైంది తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు పరిస్థితి. టీడీపీ నేతలు ఉదయం నుంచి దొంగ ఓట్లు వేసి నిబంధనలకు తూట్లు పొడిచారు. అధికార వైఎస్సార్సీపీ పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతోంది అంటూనే.. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. రిగ్గింగ్‌కు పాల్పడుతూ టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. వీడియోలో టీడీపీ బలపరిచిన డైరెక్టర్ అభ్యర్థులకు ఏక పక్షంగా బ్యాలెట్ పేపర్‌పై దొంగ ఓట్లు వేస్తున్న వీడియో వీరి డ్రామాలకు అద్దం పడుతోంది. చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే.. -
రీపోలింగ్‌కు కారణం ఎవరు?
సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. అయితే ఆయన విధానం తెర ముందు ఒకలా, తెర వెనుక మరోలా ప్రవర్తించారనే విషయం ప్రస్తుతం తేటతెల్లమవుతోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, రీపోలింగ్‌కు తావేలేదని స్పష్టంచేశారు. ఇదే విషయం ఈసీకి నివేదిక రూపంలో తెలియజేశారు. అయితే క్షేత్రస్థాయిలో పోలింగ్ రోజున పలు హింసాత్మక సంఘటనలు, టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, దాడులకు తెగబడడం జరిగింది. పోలింగ్ రోజున పూతలపట్టు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.ఎస్.బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన ఆ పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకులు అడ్డగించి ఆయన్ను తీవ్రంగా గాయపరిచి తల పగులగొట్టారు. రామచంద్రాపురం మండలంలోని వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు చేసిన దాడిలో గాయాలపాలయ్యారు. పెద్దతిప్పసముద్రం మండలంలో టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటరమణారెడ్డి మృతి చెందారు. ఇలా అనేక ఘటనలు, రిగ్గింగ్‌లు 14 నియోజకవర్గాల్లో యథేచ్ఛగా జరిగాయి. ఈ విషయాలన్నీ జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ దృష్టికి వచ్చినా తక్షణ చర్యలకు పాల్పడక నిర్లక్ష్యం చేశారు. జిల్లాలో జరిగిన ఘటనలపై వాస్తవ నివేదికలను ఈసీకి పంపకపోవడంతో ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అన్నీ అనుమానాలే.. పోలింగ్ రోజున జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో ఏప్రిల్ 10న అర్ధరాత్రి అనూహ్యంగా మంటలు చేలరేగి కాలిపోయింది. ఆ ఘటన మరుసటిరోజు ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ నాయకుల డైరెక్షన్లో పోలింగ్ జరిగే రోజున ఘటనలను పర్యవేక్షించకూడదనే ఉద్దేశంతోనే కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కాల్చివేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ కాలిపోవడం వల్ల ఏప్రిల్ 11న జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని పర్యవేక్షించలేక చాంబర్లోనే మిన్నకుండిపోయారు. దీంతో పలుచోట్ల టీడీపీ నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్‌కు, హింసాత్మక దాడులకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. వేటుకు రంగం సిద్ధం ? పోలింగ్ ముందురోజున కలెక్టర్ ప్రద్యుమ్న తనతో మాట్లాడారని ఈవీఎంల దొంగతనం కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు వేమూరి హరిప్రసాద్ చౌదరి స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యాన్ని కల్పించింది. అదేవిధంగా పోలింగ్ పూర్తయిన తరువాత జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని ఏడు పోలింగ్ బూత్‌ల ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లో లేకుండా బయటే ఉంచారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇలా ప్రతి దాన్నీ గమనిస్తే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ టీడీపీ నేతలకు ఏమేరకు సహకరించారో అర్థమవుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన రిగ్గింగ్ వీడియోలతో సహా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి వెళ్లడంతో వారు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్నపై, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌పై సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, ఓ పార్టీకి మద్దతు పలుకుతూ పనిచేశారనే ఆరోపణలకు గాను వారిద్దరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
ఓటరు స్లిప్పులు లాక్కుని టీడీపీ నాయకుల రిగ్గింగ్
సాక్షి, కందుకూరు రూరల్ (ప్రకాశం): మండలంలోని పలుకూరు గ్రామంలో ఉన్న 91, 92, 94 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఓటర్లకు మేము డబ్బులు ఇచ్చాం ఆ ఓట్లు మేమే వేసుకుంటామని టీడీపీ మండల నాయకుడు, కొందరు టీడీపీ ఏజెంట్లు ఓటర్ల వద్ద నుంచి దౌర్జన్యంగా స్లిప్పులు లాక్కొని మరీ ఓటు వేసుకున్నారు. ఎవరైనా ఓటు వేయడం చేతగాని వారు... చూపు కనిపించని వారు ఉంటే వారి బంధువులతో ఓటు వేయించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగకుండా మేము ఆ ఓటరుకి డబ్బులు ఇచ్చాం... ఆ ఓటు తామే వేసుకుంటామని ఓటరు వద్ద నుంచి స్లిప్ లాక్కొని ఓటు వేసుకున్నారు. ఏజెంట్లు వెళ్లి ఓటు వేయవద్దని వైఎస్సార్సీపీ ఏజెంట్లు వాధించినప్పటికీ పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఓట్లు వేసుకున్నారు. దీనిపై పోలింగ్ అధికారిని ఏజెంట్లు ప్రశ్నించినా మీరు తేల్చుకోండని తప్పించుకునే ధోరణితో మాట్లాడుతున్నారే తప్పా నిబంధనలను పాటించ లేదు. నా ఓటు నేను వేసుకుంటానని ఓ ఓటరు టీడీపీ ఏజెంట్‌తో వాదించాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగానే టీడీపీ ఏజెంట్ ఓటరు వద్ద స్లిప్ లాక్కొని దానిని టీడీపీ నాయకుడు రోశయ్యకు ఇచ్చారు. ఆయన స్లిప్ తీసుకుని కనీసం ఓటరును ఈవీఎం వద్దకు కూడా తీసుకెళ్లకుండా హడావిడిగా ఓటు వేశాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు వారిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఓట్లు వేసుకుంటున్నారు. ఇలా అనేక మంది ఓట్లను దౌర్జన్యంగా వేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బూత్‌లలో వెబ్ కాస్టింగ్ కెమేరాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా టీడీపీ ఏజెంట్లు ఓట్లు వేసుకోవడంపై ఓటర్ల అసహనం వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు తాము వేసుకోలేకపోతున్నామని కావాలని స్లిప్‌లు లాక్కొని ఓట్లు వేసుకున్నారని కొందరు ఓటర్లు ఆవేదన చెందారు. బూత్‌లలోని వెబ్ కాస్టింగ్ కెమేరాల పుటేజిని పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాలని ఓటర్లు కోరుతున్నారు. -
అడ్డుకున్నందుకు కక్ష సాధింపు చర్యలు
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో గురువారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ కార్యకర్తలు చేసే రిగ్గింగ్‌లను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారనే నెపంతో నియోజకవర్గంలో పలు మండలాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. టెక్కలిలో పోలింగ్ బూత్ నంబరు 111 పరిధిలో పీత రమణ, పీత రాము లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కోటబొమ్మాళి మండలం తిలారు, కొత్తపల్లి, హరిశ్చంద్రాపురం, కన్నేవలస తదితర గ్రామాల్లో సుమారు ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించారు. టెక్కలి ఆదిఆంధ్రావీధి టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన చింతాడ గణపతిని అరెస్టు చేసే ప్రయత్నాలు చేయడంతో, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగుపురం మోహనరావు, స్థానిక కార్యకర్తలంతా ఎదురు తిరిగారు. దీంతో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే స్థానిక మెయిన్‌స్కూల్, బజారు స్కూల్ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. అయితే ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు కక్ష సాధింపు చర్యలు చేయడంలో మంత్రి అచ్చెన్నాయుడు, కార్యకర్తల ప్రమేయం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. -
చీరాలలో టీడీపీ నేతల రిగ్గింగ్..
సాక్షి, చీరాల (ప్రకాశం): తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమి భయంతో చీరాలలో అడ్డదారులు తొక్కారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం అనుచరులు రూరల్ గ్రామాల్లో అరాచకాలకు పూనుకున్నారు. సీసీ కెమేరాల సాక్షిగా పోలీసుల కళ్లముందే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారు. దేవినూతల, పిట్టువారిపాలెం, తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓటర్ల స్లిప్పులు లాక్కుని వారే వెళ్లి ఓట్లు వేసుకుని రిగ్గింగ్ చేశారు. వైఎస్సార్ సీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కనీసం స్పందించకుండా అధికార పార్టీ నేతలకే వత్తాసు పలికారు. అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలను, బలరాం అనుచరులను ఒక్కమాట కూడా అనలేదు. పోలింగ్ మొదలైన రెండు గంటలకే పిట్టువారిపాలెంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్‌ను టీడీపీ కార్యకర్తలు బయటకు వెళ్లిపోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అధికారుల ముందే రాయి తీసుకుని కొట్టి బయటకు తీసుకువచ్చారు. తాను ఏజెంట్‌ను అని చెప్పినా వినకుండా మాకే ఎదురొస్తావా అంటూ ఇష్టారాజ్యంగా కొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తలకు టీడీపీ నాయకులు వేసిన రాయి తగిలి రక్తగాయమైంది. సంఘటన స్థలానికి డీఎస్పీ యు.నాగరాజు, ఇద్దరు ట్రైనీ ఎస్పీలు, సిబ్బంది రావడంతో టీడీపీ నాయకులు పరారయ్యారు. దేవినూతలలో రిగ్గింగ్... దేవినూతలలోని పోలింగ్ బూత్‌లో ఒకే ఒక్క కానిస్టేబుల్ ఉండటంతో అక్కడ టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌ను కొట్టి బయటకు పంపి పోలింగ్ కేంద్రాన్ని మూసివేసి ఓటర్ల వద్ద స్లిప్పులు లాక్కుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై దాడికి దిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా అక్కడకు వెళ్లకపోవడంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజల ఓటర్ల స్లిప్పులను టీడీపీ నాయకులు లాక్కుని ఓట్లు వేశారంటే టీడీపీ నేతలు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. గవినివారిపాలెంలో కూడా పోలింగ్ బూత్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ అధికారిపై దాడికి యత్నం... చీరాల పట్టణంలోని 29వ వార్డులో గల హరిప్రసాద్‌నగర్‌లో 84వ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు ఏజెంట్లపై దాడికి యత్నించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలి విన్నపం మేరకు ఆమె సూచించిన పార్టీ అభ్యర్థికి పోలింగ్ అధికారి ఓటు వేయించారు. అయితే, ఆ అధికారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించారంటూ దాడికి యత్నించారు. ఈ ఘటనపై టీడీపీ అభ్యర్థి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, అతని అనుచరులు హరిప్రసాద్‌నగర్‌లో హల్చల్ చేశారు . -
నవాజ్ వైదొలిగే వరకూ ఆందోళన
పాక్ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్ ఉద్ఘాటన ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రెండు వేర్వేరు ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలకు నేతృత్వం వహిస్తున్న పాక్ నేతలు ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటుతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలను కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నవాజ్ రాజీనామాకు పట్టుపడుతూ చేపట్టిన రెండు వేర్వేరు నిరసన ర్యాలీలు శనివారం ఇస్లామాబాద్ చేరాయి. వీటిలో ఒకదానికి ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వం వహిస్తుండగా.. మరోదానికి కెనడాకు చెందిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వారు ఆరోపిస్తూ తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ కార్యకర్తలు వేలాదిమంది ‘ఆజాదీ మార్చ్’ పేరిట లాహోర్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లకుపైగా దూరం పయనించి ఇస్లామాబాద్ చేరుకున్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఇమ్రాన్‌ఖాన్ భారీ వర్షం కురుస్తున్నా లెక్కచెయక ఉద్యమకారులనుద్దేశించి మాట్లాడారు. గత ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టం చేశారు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం లభించేవరకూ దీక్ష చేస్తానన్ని ప్రకటించారు. నవాజ్ పదవి నుంచి తప్పుకుని తిరిగి ఎన్నికలకు ఆదేశించేవరకూ ఇక్కడినుంచి కదలబోనన్నారు. గత ఎన్నికల్లో రిగ్గింగ్‌పై తాము ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని, దీంతో న్యాయంకోసం తాము వీధుల్లోకి రావాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తహీరుల్ ఖాద్రీ నేతృత్వంలో చేపట్టిన ‘రివల్యూషన్ మార్చ్’ కూడా ఇస్లామాబాద్‌లోని వేరొక ప్రదేశానికి చేరింది. వేలాది మంది ఆందోళనకారులు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం రాజీనామా చేయాలని, అసెంబ్లీలనూ రద్దు చేయాలని ఖాద్రీ డిమాండ్ చేశారు.