మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..11 మంది ఉగ్రవాదులు హతం | 11Militants Killed In Gunfight In Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..11 మంది కుకీ ఉగ్రవాదులు హతం

Nov 11 2024 6:20 PM | Updated on Nov 11 2024 7:06 PM

11Militants Killed In Gunfight In Manipur

ఇంఫాల్‌:మణిపూర్‌ జిరి‌బమ్‌లో సోమవారం(నవంబర్‌ 11) భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది.

కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు సోమవారం జిరిబమ్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఉన్న రిలీఫ్‌ క్యాంపును టార్గెట్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మణిపూర్‌లో గతేడాది జరిగిన అల్లర్లలో జిరిబమ్‌ పోలీస్‌స్టేషన్‌కు  ఉగ్రవాదులు పలుమార్లు టార్గెట్‌ చేసి దాడి చేయడం గమనార్హం. 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement