దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు | Sakshi
Sakshi News home page

దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు

Published Sun, May 26 2024 11:49 AM

10 Most Horrific Fire Incident In India

దేశాన్ని అగ్ని ప్రమాదాలు వణిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక గేమింగ్‌ జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి, 27 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి, ఆరుగురు శివువులు సజీవ దహనమయ్యాయి. ప్రతీ ఏటా వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దేశాన్ని వణికించిన కొన్ని అగ్ని ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుంది.

1. డిసెంబర్ 1995 (హర్యానా, మండి దబ్వాలి)
భారతదేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది. హర్యానాలోని మండీ దబ్వాలిలో జనరేటర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో జరిగిన తొక్కిసలాటలో 540 మంది మృత్యువాత పడ్డారు.

2. ఫిబ్రవరి 1997(ఒడిశా, బరిపడ) 
మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 206 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 148 మంది తీవ్రంగా గాయపడ్డారు.

3. జూన్ 1997 (న్యూఢిల్లీ) 
గ్రీన్ పార్క్‌లోని ఉపహార్ సినిమా థియేటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించారు.  సినిమా చూస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 103 సజీవ దహనమయ్యారు.

4. జూన్ 2002 (ఆగ్రా) 
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని శ్రీలీ ఇంటర్నేషనల్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 42 మంది మృత్యువాత పడ్డారు.

5. జూలై 2004(తంజావూరు, తమిళనాడు)
తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఓ పాఠశాలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 94 మంది అమాయక చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన తమిళనాడు చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా పరిగణిస్తారు.

6. సెప్టెంబర్, 2005(ఖుస్రోపూర్, బీహార్) 
బీహార్‌లోని ఖుస్రోపూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 35 మంది చనిపోయారు. దీంతో పాటు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

7. ఏప్రిల్, 2006(మీరట్) 
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని విక్టోరియా పార్క్‌లో బ్రాండ్ ఇండియా ఫెయిర్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 100 మంది మృత్యువాత పడ్డారు.

8. డిసెంబర్, 2011(కోల్‌కతా) 
కోల్‌కతాలోని ఏఎమ్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు వ్యాపించి 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి చుట్టూ మృతదేహాలు కుప్పలు కనిపించాయి.

9. సెప్టెంబర్, 2012(శివకాశి, తమిళనాడు) 
ముదలిపట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోగా, 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.

10. మే, 2022 (న్యూఢిల్లీ)
పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 మందికి పైగా జనం మరణించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement