కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి

10 Maoists Deceased Due To Corona In Dantewada District - Sakshi

ఛత్తీస్‌గఢ్‌: దంతేవాడ జిల్లాలో కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ వెల్లడించారు. ఫుడ్‌ పాయిజన్‌తో కూడా కొంతమంది మావోలు చనిపోయినట్లు సమాచారం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మృతిచెందినవారిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉన్నట్లు తెలిసిందన్నారు. బస్తర్‌ రేంజ్‌ పరిధిలో 100 మందికిపైగా కరోనాతో బాధపడుతున్నారని ఎస్పీ వెల్లడించారు.

ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులు, ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏవోబీలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో దళాల్లో పలువురికి వైరస్‌ సోకినట్టు నిఘావర్గాలు పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించాయి. ఎటువంటి భయాందోళనలకు తావులేకుండా లొంగిపోతే తగిన వైద్యసేవలు అందిస్తామంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, విశాఖ రూరల్‌ పోలీసులు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

చదవండి: మావోయిస్టులకు కరోనా ముప్పు..
కొవాక్జిన్‌ టీకాలపై భారత బయోటెక్‌ కీలక నిర్ణయం..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top