నత్తే నయం..! | - | Sakshi
Sakshi News home page

నత్తే నయం..!

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

అధికారుల పర్యవేక్షణ కరువు..

కార్యకలాపాలకు ఆటంకం..

పేట మార్కెట్‌యార్డులో రూ.2.40 కోట్లతో కవర్‌షెడ్‌ నిర్మాణం

● తొమ్మిది నెలల్లో పూర్తి కావాల్సిన పనులు నేటికీ కొనసాగుతూనే..

● భారీగా వానాకాలం వరి ధాన్యం రాక..

స్థల భావంతో అవస్థలు

పడుతున్న రైతులు

● వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం.. సరుకు నిల్వకు ఇబ్బందులు

–8లో u

నారాయణపేట: పేట మార్కెట్‌యార్డులో సౌకర్యాల కల్పన పనులు రైతులు, కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వరి పంట చేతికొచ్చి మార్కెట్‌కు పోటెత్తుతున్న వేళ.. రైతులకు ఉపయోగపడాల్సిన కవర్‌షెడ్‌ నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతోంది. రూ.2.40 కోట్లతో చేపడుతున్న పనులు తొమ్మిది నెలల్లో పూర్తిచేసి వినియోగంలోకి తేవాల్సి ఉండగా.. నేటికీ పనులు కొనసాగుతుండటంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరిపడా స్థలం లేక కమీషన్‌ ఏజెంట్లు అవస్థలు పడుతున్నారు.

సామర్థ్యానికి మించి ధాన్యం..

వానాకాలం వరి ధాన్యం మార్కెట్‌యార్డు సామ ర్థ్యానికి మించి వస్తుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. యార్డు సామర్థ్యం సుమారు 10 వేల బస్తాలు ఉండగా.. ప్రస్తుతం రోజు కు సుమారు 15 వేల బస్తాల ధాన్యం వస్తున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం సరిపోక రైతులు తమవంతు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యమేనా..?

ఓ వైపు మార్కెట్‌ పాలకవర్గం పదవీకాలం ముగి యగా.. మరోవైపు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నిర్మాణ పనుల పురోగతిపై ప్రభావం చూపుతోందనే చర్చ సాగుతోంది. సెప్టెంబర్‌ 15తో పాలకవర్గం గడువు ముగిసింది. ఈ పనుల టెండర్‌ను ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దక్కించుకుంది. పాలకవర్గంలోని ఓ ప్రతినిధి సబ్‌ కాంట్రాక్టర్‌గా పనులు ప్రారంభించగా.. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. చేపట్టిన పనులకు సంబంధించి మార్కెట్‌ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు రూ.54.62 లక్షల బిల్లులను రికార్డు చేసినట్లు సమాచారం. అయితే ఆ బిల్లులకు సంబంధించిన నగదు కాంట్రాక్టర్‌ ఖాతాలో జమ కాలేదని తెలుస్తోంది. దీంతో నిర్మాణ పనుల వేగం తగ్గుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌ ఖజానాలో నిధులు ఉన్నప్పటికీ, బిల్లులు రికార్డు చేసిన తర్వాత కూడా చెల్లింపులు జరగకపోవడంపై చర్చ జరుగుతోంది.

పేట మార్కెట్‌యార్డులో కొనసాగుతున్న కవర్‌షెడ్‌ నిర్మాణం

సంబంధిత పర్యవేక్షణ అధికారులు తరచూ సందర్శించి పనుల పురోగతిని పరిశీలించాలి. కాంట్రాక్టర్లు నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు అప్పుడప్పుడు మార్కెట్‌యార్డుకు వచ్చి పరిశీలించి వెళ్లిపోతున్నారే తప్ప పనుల వేగం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మార్కెట్‌యార్డులో స్థలాభావం కారణంగా కమిషన్‌ ఏజెంట్లు, ధాన్యం వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు, కొనుగోలు చేసిన ధాన్యా న్ని వాహనాల్లో తరలించేందుకు తగినంత స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదువుతున్నాయి. ధాన్యం రాక పెరిగే కొద్దీ ఈ సమస్యలు మరింత తీవ్రమవుతోంది. రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తకుండా మార్కెట్‌ యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement