ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

నారాయణపేట: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్‌వీకే కన్వీనర్‌, శాస్త్రవేత్త డా. ఈటెల సత్యనారాయణ సూచించారు. ఆదివారం మండలంలోని కొల్లంపల్లిలో రైతులు సాగు చేసిన మిరప, కంది, ఉల్లి పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మిరప పంటలో తామర పురుగు ఉధృతిని గుర్తించి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. పంటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చీడపీడలను ప్రాథమిక దశలోనే గుర్తించాలని, శాస్త్రవేత్తల సూచనల మేరకు తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. యాసంగి సీజన్‌లో సాగు చేస్తు న్న పంటల ఎంపిక, సాగు ప్రణాళికపై రైతులతో చర్చించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపా రు. శాసీ్త్రయ సలహాలు, సూచనలు అందించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించడంతో పెట్టుబడి తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement