గవర్నర్‌ను సత్కరించిన రెడ్‌క్రాస్‌ సభ్యులు | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను సత్కరించిన రెడ్‌క్రాస్‌ సభ్యులు

Nov 16 2026 1:14 AM | Updated on Nov 16 2026 1:14 AM

నారాయణపేట: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్లు, రాష్ట్ర మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుల సమావేశానికి జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ హరినారాయణ్‌ భట్టడ్‌, రాష్ట్ర మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు కె. సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్‌ శుక్లాను వారు స్థానిక చేనేత మగ్గంపై ప్రత్యేకంగా నేయించిన పట్టు శాలువాను కప్పి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. జిల్లా తర ఫున గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్‌ స భ్యుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారితో మమేకమై సేవాభావంతో పనిచేయాలని గవర్నర్‌ వారికి సూచించారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమరరాజా ఈఎస్‌ఎస్‌సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్‌ మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సర్వీస్‌, ఏసీ టెక్నీషియన్‌ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు.

విద్యారంగ సమస్యలపై ఉద్యమానికి సిద్ధం కావాలి

అలంపూర్‌: విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. రాబోయే రోజుల్లో ఉద్యమించేందుకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవిప్రసాద్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. అలంపూర్‌ చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో అనే సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికలు తెప్పించుకుని అమలు చేయడంతో పాటు సీపీఎస్‌ విధానం రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్‌ నాయుడు, కార్యదర్శి గోపాల్‌, నాయ కులు బి.బీసన్న, ఎస్‌.రాజశేఖర్‌, లక్ష్మణ్‌, చిరంజీవి, నాయుడు, రాముడు, తిలక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement