–8లో u
నర్వ: మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించేందుకు ప్రభుత్వం మరిన్ని స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు సుమారు ఏడాదిన్నరగా సంఘాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మహిళలు పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొంది చిరు వ్యాపారాలు, స్వయం ఉపా ధి పనులు చేపడుతూ లబ్ధి పొందుతున్నారు. మిగి లిన అర్హులైన మహిళలను గుర్తించి వీరికి అవగాహన కల్పించి రుణాలు అందించాలనే లక్ష్యంతో కొత్త సంఘాల ఏర్పాటుకు అంకురార్పణ చేసింది.
ఇవీ మార్గదర్శకాలు..
కొన్నిరోజులుగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) సంస్థల అధికారులు కొత్త మహిళా సంఘాల ఏర్పాటుకు అర్హులైన వారిని గుర్తించే పనులో నిమగ్నమయ్యారు. నిరు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 18 ఏళ్ల నుంచి 58 ఏళ్లలోపు మహిళలు సంఘాల్లో చేరే అవకాశం కల్పించారు. గతంలోని ఓటరు జాబితా ఆధారంగా మహిళలను గుర్తించి కొత్త సంఘాల్లో చేరే విధంగా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నారు. సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గ్రూపులో 10 సభ్యులు తప్పనిసరిగా ఉండాలన్నదే నిబంధన. 18 ఏళ్లు నిండిన మహిళందరూ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఐకేపీ అధికారులు క్షేత్రస్థాయిలో మహిళలను గుర్తించి సంఘాలు ఏర్పాటు చేశారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించి పొదుపు ప్రారంభించారు. అయితే వీరిని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు (రివాల్వింగ్‌ఫండ్) అందించనుంది. ఈ మేరకు కొత్త సంఘాల వివరాలు పంపాలని సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. ఇది పూర్తయితే నెలఖరులోగా ఆయా సంఘాల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 3,420 కొత్త సంఘాల ఏర్పాటు
మహిళల ఆర్థిక సంఘటితమే
లక్ష్యంగా ముందుకు..
ఒక్కో సంఘానికి
రూ.15 వేల రివాల్వింగ్ ఫండ్
వివరాల సేకరణలో అధికారులు


