జాతీయ మహాసభలను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

నారాయణపేట: నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జరిగే అఖిల భారత కిసాన్‌సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జి.వెంకట్రాంరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలో జాతీయ మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురావాలన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ.6 వేల పింఛన్‌ అందించాలని, సహకార సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, రైతులకు సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ వ్యవసాయ విధానాలను రద్దుచేసి రైతులకు అనుకూలంగా వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దాలని కోరారు. రైతుల సమస్యలు, వ్యవసాయరంగ సంక్షోభం, రైతుల హక్కుల సాధనపై జాతీయ మహాసభల్లో విస్తృత చర్చ జరగనుందని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిలయ్యగౌడ్‌, ప్రధానకార్యదర్శి దస్తప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, గోపాల్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, నాయకులు నరహరి, బాల్‌రాం, భాను, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement