ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో సమయం ఆదా | - | Sakshi
Sakshi News home page

ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో సమయం ఆదా

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

నారాయణపేట: ప్రతి ఉద్యోగి డిజిటల్‌ విధానంపై అవగాహన పెంపొందించుకొని ఆన్‌లైన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంక స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఖజానా, లెక్కలశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌ విధానంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్‌ విధానంలోకి మారుతున్నాయని, ఉద్యోగులు కూడా అందుకు సిద్ధం కావాలని సూచించారు. ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయని.. మొదటిది ఉద్యోగుల వ్యక్తిగత, సర్వీసు వివరాలు, రెండోది విధులకు సంబంధించిన వర్క్‌ మాడ్యూల్‌, మూడోది సెలవుల మంజూరు, ఇతర సర్వీసు కార్యకలాపాలని వివరించారు. ఈ సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి రావడంతో ఉద్యోగులకు సమయం ఆదా కావడమే కాకుండా పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందన్నారు. గతంలో సర్వీస్‌బుక్స్‌, పాత రికార్డులు, ఇంక్రిమెంట్లు, సెలవులు, సంతకాలు, గ్యాప్‌ పీరియడ్స్‌ వంటి వివరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. కొత్త విధానంలో ఉద్యోగుల వివరాలు డిజిటల్‌ సంతకాలతో భద్రపర్చడంతో అవసరమైనప్పుడు సులభంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన ఆనన్‌లైనన్‌ అటెండెనన్స్‌ విధానాన్ని కొందరు అధికారులు, సిబ్బంది ఇంకా పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని పేర్కొన్నారు. ప్రతి హెచ్‌ఓడీ తన పరిధిలోని ఉద్యోగులందరూ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆన్‌లైన్‌ హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు హాజరు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తామని.. 22, 23 తేదీల్లో అటెండెనన్స్‌ వివరాలను ప్రత్యేకంగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ నెల 25 నుంచి వేతనాల బిల్లుల అప్‌లోడింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బిల్లులు సమర్పించే ముందు ఆన్‌లైనన్‌ హాజరు వివరాలు సక్రమంగా నమోదయ్యాయో లేదో పరిశీలిస్తామన్నారు. ప్రస్తుత నెల జీతాలను కేవలం ఆన్‌లైన్‌ అటెండెనన్స్‌ ఆధారంగా నిర్ణయించడం లేదని స్పష్టం చేస్తూనే.. ప్రతి ఉద్యోగి హాజరు నమోదును తప్పనిసరిగా పర్యవేక్షిస్తామని తెలిపా రు. మూడురోజుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధికారులు, హెచ్‌ఓడీలు, డీడీఓలు, సంబంధిత సిబ్బంది పూర్తిస్థాయిలో పాల్గొని ప్రతి అంశంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగుల వ్యక్తిగత, సర్వీసు వివరాల నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి వివరాన్ని పరిశీలించిన తర్వాతే అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. డీటీఓ రాజ్‌గోపాల్‌చారి నూతన సాఫ్ట్‌వేర్‌ వినియోగం, ఉద్యోగుల వివరాల నమోదు, పరిపాలన ప్రక్రియలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను వివరించారు. పీఏఓ దేవ్‌సింగ్‌తో పాటు జిల్లాలోని అన్ని శాఖల జిల్లాఅధికారులు, డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ అధికారులు (డీడీఓలు), కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement