నారాయణపేట: బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేయాలని.. పోలీస్‌స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎస్పీ వినీత్ మంగళవారం ఒక ప్రకటనలో పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులున్నా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన సందర్భాల్లో బాధితుల వద్దే ఆనన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహి ళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గాయపడిన బాధితులు, పిల్లలు, మైనర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారితో పాటు మారుమూల ప్రాంతాల్లో నివసించే బా ధితుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తూ బాధితుల భద్రత, గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆదేశించారు.
వరి క్వింటా రూ.3,839
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం వరి (సోనరకం) క్వింటా గరిష్టంగా రూ.3,839, కనిష్టంగా రూ. 2,280.. హంస రకం గరిష్టంగా రూ.2,983, కనిష్టంగా రూ.2,201 ధరలు పలికాయి.
మన్యంకొండలో కార్తీక దీపోత్సవం ప్రారంభం
మహబూబ్‌నగర్ రూరల్: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే దీపారాధనలో భాగంగా మంగళవారం అర్చకులు రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా కార్తీక దీపాన్ని వెలిగించారు. ఈ దీపం నెల రోజుల పాటు నిరంతరంగా వెలుగనుంది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు.


