19వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష | - | Sakshi
Sakshi News home page

19వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష

Nov 1 2026 7:25 AM | Updated on Nov 1 2026 7:25 AM

నారాయణపేట: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాకేంద్రంలోని మున్సిపల్‌ పార్కు దగ్గర జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 19వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో యూనియనన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు భిక్షపతి, అధ్యక్షుడు ప్రసాద్‌ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నా తమ సమస్యలు మాత్రం నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి రాఘవేందర్‌, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement