కొత్తపల్లి: ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలు, పోరాటస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. శనివారం మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటుచేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన శివాజీ విగ్రహ దాతలు మాజీ సర్పంచ్ అంబటి వెంకటయ్య, రాములు కుటుంబసభ్యులు, గ్రామస్తులు, యువకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. శివాజీ ధైర్యం, దేశభక్తి, స్వాభిమానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామ ముఖద్వారం, శివాజీ విగ్రహ దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విగ్రహావిష్కరణకు హాజరైన ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బుడోళ్ల మల్లీశ్వరీ శ్రీనివాస్, జిల్లా నాయకులు సత్యయాదవ్, పడాకుల శ్రీను, బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
శివాజీ
విగ్రహావిష్కరణలో ఎంపీ డీకే అరుణ తదితరులు
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ


