అప్రమత్తతతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

Nov 1 2026 7:25 AM | Updated on Nov 1 2026 7:25 AM

నారాయణపేట: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్‌ సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఫ్లాష్‌ వాక్‌ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సావర్కర్‌ చౌరస్తా వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనన్‌లైన్‌ మోసాలు, నకిలీ లింకులు, పెట్టుబడుల పేరుతో మోసాలు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల ఆశజూపడం, సోషల్‌ మీడియా వేధింపులు, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో బెదిరింపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దని, అధిక లాభాల ఆశచూపే పెట్టుబడి పథకాలను నమ్మి డబ్బులు పంపవద్దని హెచ్చరించారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులమని ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేసే నమ్మవద్దని స్పష్టం చేశారు. సైబర్‌ మోసానికి గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్‌క్రైం హెల్ప్‌లైనన్‌ నంబర్‌ 1930కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్‌ నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ నేరాల నివారణకు జిల్లా పోలీసుశాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ ఉల్‌హక్‌, డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, ఆర్‌ఐ విజయభాస్కర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, విజయభాస్కర్‌, బాలరాజు, నరేష్‌, కేటీ మల్లేష్‌, పురుషోత్తం, పోలీసు సిబ్బంది, యువత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement